ప్రేమలో పడ్డ మిల్కీ బ్యూటీ... సోషల్ మీడియాలో తమన్నా ఫొటోలు హల్‌చల్
పాలపొంగుల వంటి అందాలతో తెలుగు యువతను కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా, లాక్ డౌన్ పుణ్యమాని ప్రేమలో పడిందట. ఇక అందులో మజా తెలిసివచ్చాక అమ్మడిలో కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయట. ఇంతకూ తమన్నా ప్రేమలో పడింది ఎవరితో అంటారా? ప్రకృతితో...
నిజమే, తమన్నా ప్రకృతితో ప్రేమలో పడిందట. ఇన్నాళ్లూ ప్రకృతి పట్ల ఆకర్షణ ఉన్నప్పటికీ, తన బిజీ షెడ్యూలు వల్ల అమ్మడు ఎప్పుడూ ఆ దిశగా దృష్టి సారించలేకపోయింది. ఇక లాక్ డౌన్ కాస్త వెసులుబాటు కల్పించడంతో బ్యాక్ ప్యాక్ తో చక్కర్లు కొట్టేస్తోంది. తనకు నచ్చిన ప్రదేశాలన్నీ చుట్టేస్తోంది.
లాక్ డౌన్ లో మెరుపు తీగలాంటి తన శరీరానికి ఎక్స్ట్రా కండ పట్టకుండా తెగ కసరత్తులు చేసిన మిల్కీ, సమయం చిక్కితే ఇప్పుడు చక్కని ట్రెక్ కు చెక్కేస్తోందట. ఇందులో భాగంగానే ఇటీవల మౌళీ గాఢ్ అనే ప్రాంతానికి వెళ్లి, అక్కడి ప్రకృతి అందాల్లో తడిసి ముద్దైంది. ఇక ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అవి చకచకా వైరల్ అయిపోయాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ప్రకృతితో మమేకమవుతున్న కొద్దీ, దాన్ని పరిక్షించుకోవడంలోని ఆవశ్యకతను కూడా తమన్నా అర్ధం చేసుకుందట. అందుకే ఇకపై చిత్తశుద్ధితో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ఫిక్స్ అయిందట. మరోవైపు దర్శకుడు సంపత్ నంది నేతృత్వంలో సీటీమార్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న తమన్నా, ఇందులో కబ్బాడీ కోచ్ గా కనిపించబోతోంది. ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తవ్వగా, లాక్ డౌన్ అనంతరం మిగతా షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











