ఇక టాలీవుడ్ లో అసలు పోటీ వాళ్ళిందరి మధ్యే...!
మొదట తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన తమన్నా ఆ తర్వాత హ్యాపీడేస్ వంటి హిట్ చిత్రంలో నటించినా సరైన గుర్తింపు రాకపోవడంతో కోలీవుడ్ చెక్కేసింది. అక్కడ బిజీగానే వున్నప్పటికీ తెలుగులో హిట్ కొట్టాలని మళ్ళీ ఒక్కడికి వచ్చింది. వచ్చీ రావడంతోనే '100%లవ్" తో మంచి కమర్షియల్ హిట్ కొట్టింది. దీంతో తమన్నా దశ తిరిగిపోయింది. '100%లవ్"లో ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో '100% సక్సెస్ అయింది. నాగచైతన్య కంటే హీరోయిన్ తమన్నాకే ఎక్కువ పేరు తెస్తోంది. అన్ని కోణాల్లోనూ ఆర్టిస్టుగా తమన్నా మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇక అందం పరంగా చెప్పేక్కర్లేదు. మిల్కీ వైట్ కలర్ లో ఆమె అందాలు యువతను పిచ్చెక్కిస్తున్నాయి. రేపు బద్రీనాథ్ కూడా రిలీజ్ అయితే, అగ్ర స్థానానికి దూసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే రెమ్యునేరేషణ్ పరంగా కోటి రూపాయలు దాటేసింది. ఇక ఈ సక్సెస్ తో మరింత డిమాండ్ చేసినా చేయచ్చు!
అలాగే, అప్పుడే మిగతా హీరోయిన్లు ఈమె సక్సెస్ చూసి కంగుతింటున్నారు. ముఖ్యంగా తమన్నా ఎఫెక్ట్ ఇమ్మీడియేట్ గా ఇలియానా మీద వుంటుంది. ఇలియానాని అనుకున్న వాళ్లు తమన్నాని రీప్లేస్ చేయచ్చు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసే సినిమా నుంచి ఇలియానాని తప్పిస్తున్నారని అంటున్నారు. ఏమైనా, ఇప్పుడిక టాలీవుడ్ లో అసలు పోటీ తమన్నా, కాజల్ మధ్యే వుంటుంది!


Click it and Unblock the Notifications











