పెళ్లిపై తమన్నా క్లారిటీ.. అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ..

గత పదేళ్లుగా సౌత్ ఇండియా తెరపై ఒకేరమైన గ్లామర్ ఒలకబోసిన హీరోయిన్ ఎవరంటే.. ఠకీమని తమన్నా పేరే చెబుతారంటా. కెరీర్ ఆరంభంలోనే తన ప్రతిభను వెలికి తీసిన మిల్కీ బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేసి స్టార్ హీరోల సరసన నటించింది. బోల్డ్‌గా కనిపించడంలోనూ ఏ మాత్రం వెనుకాడని ఈ భామకు ఇంకా పెళ్లి కాలేదు. దీంతో ఆమె ఏదైనా కార్యక్రమంలో కనిపిస్తే చాలు.. తమ్ము నీ పెళ్లెప్పుడు? వరుడు దొరికాడా? అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తన తాజా సినిమా దేవి 2 చిత్ర ప్రమోషన్స్ కి వెళితే అక్కడా ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ ప్రశ్నకు ఓపికగా స్పందించిన తమన్నా తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది.

''నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నా. మంచి వ్యక్తి దొర‌క‌డ‌మే ఆల‌స్యం పెళ్లి పీటలెక్కేస్తా. మంచి పెళ్లి కొడుకును చూడమని మా డైరెక్టర్ విజయ్‌కి కూడా చెప్పాను. ఆయనే కాదు మీలో కూడా ఎవ‌రైనా మంచి వ్యక్తిని సూచిస్తే అతన్ని పెళ్లి చేసుకోవ‌డానికి నేను సిద్ధంగా ఉన్నా'' అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది తమన్నా. దీంతో మరోసారి తమన్నా పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చి చర్చనీయాంశం అయింది.

Milky Beauty Tamannaah gave clarity on her marriage

ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే అభినేత్రి 2 తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ.. మరికొద్ది రోజుల్లో దేవి 2 సినిమా ద్వారా వెండితెరపై మెరవనుంది. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా సరసన తమన్నా నటిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది తమన్నా. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాణంలో శరవేగంగా శహోటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 2 న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో తాను ఐటెమ్ సాంగ్‌లో న‌టించానని, భ‌విష్య‌త్తులో కూడా ఐటెం సాంగ్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మేన‌ని తమన్నా కన్ఫర్మ్ చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X