twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్లామర్‌తో పిచ్చెక్కిస్తున్న యువ ఎంపీలు.. క్రేజీగా పార్లమెంట్‌లోకి 30 ఏళ్ల బ్యూటీలు

    |

    ఒకప్పడు సినీ రంగంలో సీనియర్లయిన తర్వాత కొంత మంది తారలు రాజకీయాల వైపు చూసేవారు. కానీ నేటితరం హీరోయిన్లు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. కేరీర్ ఊపులో ఉండగానే రాజకీయాల వైపు దృష్టిపెడుతున్నారు. తాజాగా బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువ హీరోయిన్లు పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతుండటం దేశవ్యాప్తంగా మీడియాలో చర్చకు దారి తీస్తున్నది. 30 ఏళ్ల వయసులోనే పార్లమెంట్‌లో అడుగుపెట్టబోయే ఈ బ్యూటీలు చట్టసభలకు గ్లామర్ తీసుకు రాబోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎంపీగా ఎన్నికైన హాట్ హీరోయిన్లు మిమి చక్రవర్తి, నుస్రత్‌, ఇతర మహిళా సినీ ఎంపీల గురించి మీ కోసం..

    జాదవ్ పూర్ స్థానం నుంచి మిమి చక్రవర్తి

    జాదవ్ పూర్ స్థానం నుంచి మిమి చక్రవర్తి

    మిమి చక్రవర్తి తాజాగా జరిగిన ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. మోడల్, యాక్టర్‌గా రాణిస్తున్న ఈ అందాల సుందరి త్వరలోనే పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొన్న మిమి చక్రవర్తి 2011లో బెంగాల్ సినీ, టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించారు. తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించిన మిమి బీజేపీ అభ్యర్థిపై 3 లక్షల ఓట్లతో విజయం సాధించారు. మిమి వయసు 30 సంవత్సరాలు.

    టీఎంసీ ఎంపీగా నుస్రత్ జహాన్ విజయం

    టీఎంసీ ఎంపీగా నుస్రత్ జహాన్ విజయం

    బెంగాల్ నుంచి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న మరో హీరోయిన్ నుస్రత్ జహాన్. 2010 మిస్ కోల్ కతాగా ఎన్నికైన తర్వాత సినీరంగంలోకి ప్రవేశించింది. సినిమాలో అగ్రతారగా రాణిస్తూనే రాజకీయాలపై ఆసక్తి చూపింది. మార్చి 12న నుస్రత్‌ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజకీయాల్లోకి ఆహ్వానించింది. బసిర్హత్ లోక్‌సభ నియోజకం వర్గంలో టీఎంసీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పోటీ చేసి గెలుపొందింది. నుస్రత్ వయసు 29 సంవత్సరాలు.

    అమేథీలో సృతి ఇరానీ హవా

    అమేథీలో సృతి ఇరానీ హవా

    ఇక గ్లామర్ ప్రపంచం నుంచి ఎన్నికైన టాప్ యాక్టర్లలో సృతి ఇరానీ ఒకరు. అమేథీ నుంచి రాహుల్ గాంధీపై ఘనవిజయం సాధించారు. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడం సృతికి ఇది మూడోసారి. గతంలో మంత్రి పదవిని కూడా చేపట్టిన విషయం తెలిసిందే. టెలివిజన్ సీరియల్స్‌లో ప్రజాదరణ పొందిన నటి సృతి బీజేపీలో గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్నారు.

    పార్లమెంట్‌లోకి హేమ, కిరణ్ ఖేర్ మరోసారి

    పార్లమెంట్‌లోకి హేమ, కిరణ్ ఖేర్ మరోసారి

    పార్లమెంట్‌కు వెళ్తున్న మరో సీనియర్ నటి హేమమాలిని. మథుర నియోజకర్గం నుంచి బీజేపీ టికెట్‌పై విజయం సాధించారు. అలాగే కిరణ్ ఖేర్ చంఢీగడ్ లోక్‌సభ నుంచి గెలిచి మరోసారి పార్లమెంట్‌లో అడుగుపెడుతున్నారు. హేమామాలిని, కిరణ్ ఖేర్ ఇప్పటికే పార్లమెంట్‌లో సీనియర్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Few are celebrities, such as Nusrat, Mimi, Smriti Irani, Mimi Chakraborty, Hema Malini, Nusrat Jahan, and Kirron Kher. Bengali film and television actors – Mimi Chakraborty and Nusrat Jahan. They were given the task of fighting from the prestigious Jadavpur and Basirhat seats respectively
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X