అర్ధరాత్రి నడిరోడ్డుపై సినీ నటికి వేధింపులు, టాక్సీ డ్రైవర్ అరెస్ట్

బెంగాలీ హీరోయిన్, జాదవ్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపికైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిమి చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. సోమవారం అర్ధరాత్రి తన కారులో ప్రయాణిస్తుండగా ఓ టాక్సీ డ్రైవర్ వెంటపడి వేధించాడు. ఈ ఘటన బలీగుంగే ఫారీ ప్రాంతంలో చోటుచేసుకొన్నది. దాంతో ఆమె కోల్‌కతాలోని గరియాహాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, టాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. సినీ నటి మిమి చక్రవర్తిని వేధించడానికి కారణమేమిటంటే...

మిమిపై దారుణంగా కామెంట్స్

మిమిపై దారుణంగా కామెంట్స్

సినీ నటి మిమి చక్రవర్తి ఈ మధ్య మహాలయ స్పెషల్‌‌లో భాగంగా మహిషాసుర మర్ధిని అనే షోలో కనింపించారు. త్వరలోనే ప్రసారం కానున్న ఈ షోను బెంగాళీ దర్శకుడు కమలేశ్వర్ రూపొందించారు. ఈ షో నేపథ్యంలో మిమిని ఉద్దేశించి టాక్సీ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెను దారుణంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే టాక్సీ డ్రైవర్ వేధింపులను భరించలేక అక్కడే ఆతడిని చివాట్లు పెట్టారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నన్ను దుర్బషలాడుతూ.. వేధించాడు

నన్ను దుర్బషలాడుతూ.. వేధించాడు

మిమి చక్రవర్తి ఈ ఘటనపై స్పందిస్తూ.. 14వ తేదీ రాత్రి 1.30 గంటల ప్రాంతంలో గరియాహాట్ రోడ్ నుంచి బల్లీగుంజే ఫన్ని వైపు ప్రయాణిస్తున్నాను. గరియాహట్ క్రాసింగ్ వద్ద టాక్సీ డ్రైవర్ నాతో చెడుగా ప్రవర్తించాడు. దాంతో టాక్సీ డ్రైవర్‌పై కంప్లయింట్ చేశాను అని మీడియాకు తెలిపారు.

టాక్సీ డ్రైవర్ అరెస్ట్.. కేసు నమోదు

టాక్సీ డ్రైవర్ అరెస్ట్.. కేసు నమోదు

మిమి చక్రవర్తి ఫిర్యాదు అందుకొన్న పోలీసులు టాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. టాక్సీ డ్రైవర్‌ను దేబా యాదవ్‌గా గుర్తించారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354, 354A, 354D, 50 కింద కేసు నమోదు చేశారు. అతడి దుష్ప్రవర్తన వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
లండన్‌లో బాజీ సినిమా షూటింగ్

లండన్‌లో బాజీ సినిమా షూటింగ్

సినీ నటి మిమి చక్రవర్తి బాజీ అనే బెంగాళీ చిత్రంలో నటిస్తున్నారు. మార్చికి ముందు లండన్‌లో జరిగిన షూటింగులో పాల్గొన్నారు. కరోనా పరిస్థితులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆమె కోల్‌కత్తాకు తిరిగి వచ్చారు. దాదాపు 14 రోజులపాటు ఆమె క్వారంటైన్ జీవితాన్ని గడిపారు. ప్రస్తుతం మళ్లీ సినిమాలు, లోక్‌సభ సమావేశాలతో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X