పవన్ కల్యాణ్ అధికారికంగా మూడు పెళ్లిళ్లు.. అనధికారికంగా ఎన్నో.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్రో ది అవతార్ సినిమాపై అంబటి రాంబాబు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. బ్రో సినిమాకు అక్రమ పెట్టుబడులు ఉన్నాయని ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్, బ్రో సినిమా గురించి అంబటి మాట్లాడుతూ..
బ్రో ది అవతార్ సినిమాలో రాజకీయాలు జొప్పించి నన్ను గోకారు. నా పిర్రను గిల్లారు కాబట్టి ఆ సినిమా గురించి మాట్లాడుతాను. చెగువేరా స్పూర్తి. కమ్యూనిస్టు సిద్దాంతాలను గౌరవిస్తాను. నీతి, నియమాలకు కట్టుబడి ఉన్నానని చెప్పే పవన్ కల్యాణ్‌ను ఆయన రెమ్యునరేషన్ విషయంలో ప్రశ్నిస్తున్నాను. బ్రో సినిమాకు తీసుకొన్న రెమ్యునరేషన్ గురించి, ఇచ్చిన రెమ్యునరేషన్ గురించి అడిగితే పవన్, విశ్వ ప్రసాద్ సమాధానం చెప్పడం లేదు అని అంబటి రాంబాబు అన్నారు.

జనసేన పార్టీ నేతలు నాపై సినిమా తీయాలనుకొంటే తీసుకోమని చెప్పండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా పేరుపై సినిమా తీస్తే నాకు సంతోషం. సంబరాల రాంబాబు కాకుండా సందులో శ్యాంబాబు అలియాస్ అంబటి రాంబాబు అని పెట్టినా నాకు అభ్యంతరం లేదు. సినిమా పూర్తి చేయలేకపోతే నన్ను అడిగితే నేను ఆర్థిక సహాయం చేస్తాను. నన్ను విలన్‌గా చూపినా.. హీరోగా చూపినా నాకు అభ్యంతరం లేదు అని అంబటి రాంబాబు అన్నారు.
మేము కూడా మూడు పెళ్లిళ్లు చేసుకొన్న ఓ వ్యక్తి గురించి సినిమా తీస్తున్నాం. టైటిల్ కోసం పరిశీలిస్తున్నాం. మాకు పోటీగా వాళ్లు సినిమా తీస్తే.. చాలా సంతోషం. జనసేన పార్టీ రాజకీయాలు మానేసి సినిమాలు తీస్తున్నారా? వైసీపీ తరఫున సినిమాలు తీయడం లేదు. నేను సొంతంగా సినిమా తీస్తున్నాను. అందులో పవన్ కల్యాణ్‌ను యాక్ట్ చేయమని చెప్పండి. కావాలంటే రెమ్యునరేషన్ తీసుకోమని చెప్పండి అని అంబటి అన్నారు.

బ్రో సినిమాకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్నానని చెప్పిన ఆయన నేను అడిగితే నిర్మాత గానీ, పవన్ కల్యాణ్ గానీ సమాధానం ఎందుకు చెప్పడం లేదు. ఆయన పచ్చి మోసం చేస్తున్నారు. అఫీషియల్ తీసుకొనేది కొంత.. అనధికారికంగా తీసుకొనేది ఎంతో. అధికారికంగా మూడు పెళ్లిళ్లు.. అనధికారికంగా చేసుకొనేవి ఎన్నో అని అంబటి విమర్శించారు.
బ్రో సినిమాలో నా డ్యాన్స్ సీన్ పెట్టి శునకానందం పొందుతున్నాడు. అవేమీ నేను పట్టించుకోను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సినిమాల్లో నటించి హీరో అయి రాజకీయాల్లోకి రాలేదు. బ్రో సినిమా గురించి నేను ఎన్ని చెప్పినా ఆ సినిమా ఆడదు అని అంబటి రాంబాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











