Bro The Avatar వివాదం ఢిల్లీకి.. బ్లాక్ మనీతో పవన్ కల్యాణ్ మూవీ అంటూ అంబటి ఫిర్యాదు
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ విడుదలైనప్పటి నుంచి ఏపీ మంత్రి అంబటి వివాదం నడుస్తునే ఉంది. ఇక ఈ సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ తనను ఉద్దేశించి పెట్టారని ఆరోపించిన మంత్రి... పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, చిత్ర నిర్మాత టీజీ వెంకటేష్ పై సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన ఈ చిత్రంపై మరిన్నీ ఆరోపణలు చేశారు. అంతే కాదు.. ఈరోజు ఈడీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు ఇవ్వనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
శ్యాంబాబు... రాంబాబు...: పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీ గత శుక్రవారం రిలీజ్ అయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా ఎలా ఉన్నా కానీ.. కలెక్షన్ల పరంగా పర్వాలేదని పిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్రో కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఉండే శ్యాంబాబు క్యారెక్టర్ తనను ఉద్దేశించి పెట్టారంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.

ఢిల్లికి పంచాయితీ...: గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు.. బ్రో సినిమాపై విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ తో సహా త్రివిక్రమ్ శ్రీనివాస్, చిత్ర నిర్మాత టీజీ వెంకటేష్ అందరినీ టార్గెట్ చేస్తూ.. ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వారికి మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ వివాదం రోజు రోజుకూ ముదిరిపోతుంది. ఇవాళ రాత్రికి మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్లనున్నారట.

ఎంపీలను కలవనున్న మంత్రి...: ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలను అంబటి రాంబాబు కలవనున్నారని తెలుస్తోంది. బ్రో సినిమాకు విదేశాల నుంచి నిధుల తరలింపుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తారని సమాచారం. బ్రో సినిమా పెద్ద స్కామ్ అంటూ.. అమెరికాలోని చంద్రబాబు ముఠా వసూలు చేసిన డబ్బుతో నిర్మాత ప్యాకేజీ ఇచ్చినట్లు విమర్శిస్తున్నారు.

వివాదం చేసి...: అయితే పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ కు ఇన్‌కమ్ ట్యాక్స్ కు లెక్కలు చెప్పారా అని నిలదీశారు అంబటి రాంబాబు. పవన్ శునకానందం వల్లే బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశార. ఇప్పటివరకు ఆ సినిమాకు రూ.55.26 కోట్లే వచ్చాయని అభిప్రాయపడ్డారు. ఇకపై తనపై వివాదం చేసి.. కలెక్షన్లు పెంచుకోవాలని చూస్తున్నట్లు ఆరోపించారు.

సవాల్...: దమ్ముంటే రాంగోపాల్ వర్మలా రాజకీయ వ్యంగ్య చిత్రం తీసుకోవాలని అంబటి చిత్ర యూనిట్ కు సవాల్ విసిరారు. మేడిపండు లాంటి పవన్ జీవితంపై త్వరలో సినిమా తీస్తా అంటూ చెప్పుకొచ్చారు. మహిళా లోకం మెచ్చుకునేలా క్లైమాక్స్‌లో ఆయనకు గుణపాఠం చెబుతామని అన్నారు. ఇక ఈ సినిమాకు 'నిత్య పెళ్ళికొడుకు.. పెళ్ళిళ్ళు-పెటాకులు, తాళి-ఎగతాళి పేర్లు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ కథకు సరిపోయే మంచి పేరు పెట్టిన వారికి బహుమతి ఇస్తామని వివరించారు.


Click it and Unblock the Notifications











