తెలంగాణ బిడ్డ.. ఏ సాయమైనా చేస్తాను.. రాహుల్ సిప్లిగంజ్‌పై మంత్రి హరీష్ రావు
రాహుల్ సిప్లిగంజ్ ఊత పదం గురించి అందరికీ తెలిసిందే.చిచ్చా, కాక అంటూ మన పక్కింటి కుర్రాడిలా కలిసిపోతుంటాడు. అలా కలివిడిగా ఉన్నాడు కాబట్టే బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచాడు. రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ బ్రాండ్‌ను తన స్టైల్లో ప్రమోట్ చేస్తుంటాడు. తన ప్రైవేట్ ఆల్బమ్స్‌లో మొత్తం తెలంగాణ పదాలనే వాడుతుంటాడు. ఇప్పుడు తన సినిమా టైటిల్ కూడా తెలంగాణలో ఫేమస్ అయిన పదాన్నే వాడేశాడు.

చిచ్చా అంటూ రచ్చ..
రాహుల్ సిప్లిగంజ్ గత కొన్ని రోజులుగా తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ తన శరీరాకృతిని మార్చుకునే పనిలోపడ్డాడు. హీరో అంటే దానికి తగ్గ ఫిజిక్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే రాహుల్ బాడీని చాలా కష్టపెట్టాడు. మొత్తానికి నిన్న తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశాడు.

సిద్దిపేటలో అలా..
రాహుల్ సిప్లిగంజ్ తన సినిమాలతో పాటుగా వ్యాపారాలను కూడా చూసుకుంటున్నాడు. సింగర్, నటుడు, హీరోగా బిజీగా ఉంటూనే బిజినెస్ మెన్‌గా దూసుకుపోతోన్నాడు. ఈక్రమంలో సిద్దిపేటలో ఊకో కాక బ్రాంచ్‌ను ప్రారంభించాడు. ఈ ఈవెంట్‌కు మంత్రి హరీష్ రావును ముఖ్య అతిథిగా తీసుకొచ్చాడు.

మంత్రి చేతుల మీదుగా..
నిన్న (మార్చి 19) సాయంత్రం ఊకో కాక స్టోరూంను లాంచ్ చేసిన అనంతరం రాహుల్ తన కొత్త సినిమా ప్రకటనను చేశాడు. ఈ మేరకు హరీష్ రావు.. రాహుల్ సిప్లిగంజ్ సినిమా పోస్టర్, టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు. అనంతరం మాట్లాడుతూ రాహుల్ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.

తెలంగాణ బిడ్డ..
చిచ్చా అనే మంచి సినిమాను మనం లాంచ్ చేశాం. టైటిల్ కూడా బాగుంది. రాహుల్ సిప్లిగంజ్ మన తెలంగాణ బిడ్డ. తెలంగాణ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమాకు ఎలాంటి సాయం చేసేందుకు అయినా నేను సిద్దంగా ఉన్నాను. బిగ్ బాస్ షోను ఎలా హిట్ చేశాడో దీన్ని కూడా అంతే హిట్ చేయాలి.. ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఎదగాలి అంటూ మంత్రి హరీష్ కోరాడు.

చిచ్చా టైటిల్ సాంగ్..
ఇక చిచ్చా అంటూ రాహుల్ సిప్లిగంజ్ చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. టైటిల్ పోస్టర్, సాంగ్ రెండూ కూడా వైరల్ అవుతున్నాయి . ఆర్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ మూవీని మల్లిక్ కందుకూరి తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











