సమంత వ్యవహారం.. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశం!
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు సెన్సేషనల్ క్రియేట్ చేసింది. దక్షిణాది చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం దృష్ట్యా కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే పలు వివాదాల్లోనూ సమంత రూత్ ప్రభు పేరు వినిపించడం హాట్ టాపిక్ గ్గా మారింది. తాజాగా పొలిటికల్ సర్కిల్స్ లో సమంత పేరు మారుమోగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇప్పటికీ ప్రశ్నార్థకం?
సమంత రూత్ ప్రభు 2010 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగచైతన్యతో ఏ మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఇదే తొలిచిత్రం కావడం విశేషం. ఇక సమంత చైతన్యతో కలిసి పలు చిత్రాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే. 2017లో వీరిద్దరు వివాహం కూడా చేసుకున్నారు. కానీ 4 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత 2021లో డివోర్స్ తీసుకోవడం అందరికీ షాక్ కు గురి చేసింది. ఇంతకీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది.

టాలీవుడ్ కు దూరంగా..
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు టాలీవుడ్ లో సినిమాల జోరుగా తగ్గించింది. తన సెపరేషన్ తర్వాత ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేక ఇబ్బందులు పడింది. మయోసైటిస్ వ్యాధికి గురై ఏడాదిన్నర పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం హెల్త్ విషయంలో బెటర్ అయ్యింది. దీంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. కానీ గతంలో ఉన్న యాక్టివ్ గా టాలీవుడ్ లో ఇప్పుడు సమంత కనిపించడం లేదని చర్చగా మారింది. టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పొలిటికల్ సర్కిల్స్ లో సమంత పేరు..
స్టార్ హీరోయిన్ సమంతపై గతంలో మంత్రి కొండ సురేఖ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ పొలిటిషన్ ను దెప్పి పొడిచే క్రమంలో సమంత పేరును వాడింది. నాగార్జున కుటుంబంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయొద్దంటే నాగార్జునతో ప్రముఖ పొలిటిషన్ సమంతను డిమాండ్ చేశాడంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. దాంతో వెంటనే ఆయన ఆమెపై పరువు నష్టం కింద కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఆ కేసుపై ఆగస్టు 2న నాంపల్లి కోర్టు స్పందించింది. మినిస్టర్ కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
సమంత నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
సమంత రూత్ ప్రభు చివరిగా పుష్ప : దిరైజ్, యశోద, శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ప్రొడ్యూసర్ గా రీసెంట్ గా 'శుభం' అనే చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చింది. మంచి రిజల్ట్ ను అందుకుంది. ఇక నెక్ట్స్ తెలుగులో మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ లో రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్ అనే హిందీ టీవీ సిరీస్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











