Prabhas Malla Reddy: ప్రభాస్ ది మేకప్.. మంత్రి మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్.. కాలేజీ ముందే తొక్కుతరు అంటూ!

తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల కాలంలో ఆయన ఏం మాట్లాడిన తెగ వైరల్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయనపై వచ్చే మీమ్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో తెలిసిందే. అంతేకాకుండా మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఆయన ఇచ్చే స్పీచ్ లు హైలెట్ గా నిలుస్తుంటాయి. అయితే తాజాగా ఆయన మేమ్ ఫేమస్ అనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చాలా ఆసక్తిర కామెంట్స్ చేశారు. అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయనపై మళ్లీ ట్రోలింగ్ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

చిరంజీవి సమక్షంలో..

చిరంజీవి సమక్షంలో..

తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి స్పీచ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో తెలిసిందే. అందుకు నిదర్శనంగా మరోసారి తనదైన స్పీచ్ తో అదరగొట్టారు మంత్రి మల్లారెడ్డి. ఎప్పుడు బోల్డ్ గా మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. తన మాటలతో, చేష్టలతో నవ్వులు పూయిస్తుంటారు మంత్రి మల్లారెడ్డి. ఆ మధ్య మేడే రోజు మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో తన స్పీచ్ తో స్టేజ్ దద్దరిల్లేలా చేసిన ఆయన తాజాగా మరోసారి నవ్వించారు.

ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆసక్తికర వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ నేత అయిన మంత్రి మల్లారెడ్డి తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. సుమంత్ ప్రభాస్ హీరోగా చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ లో వస్తున్న చిత్రం మేమ్ ఫేమస్. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది సినిమా టీమ్. ఈ క్రమంలోనే తాజాగా ఏర్పాట్ చేసిన ఓ ప్రమోషన్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన మాటలతో ఒక విధంగా మీమర్స్ కు కూడా మంచి స్టఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నవ్వులు పూయిస్తూ..

నవ్వులు పూయిస్తూ..


మేము ఫేమస్ హీరో సుమంత్ ప్రభాస్ పై ప్రశంసల జల్లు కురుపించాడు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణ నుంచి మళ్లీ మరో మంచి కుర్రాడు హీరోగా వస్తున్నాడని చెప్పిన ఆయన ఈ రకంగా తెలంగాణ యువత కూడా ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా అనే డైలాగ్స్ తో మరోసారి నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ ప్రజలకు అవకాశాలు రాలేదని, కానీ ఇప్పుడు ఏకంగా మన భాషతోనే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు.

 అవకాశాలు వస్తున్నాయని..

అవకాశాలు వస్తున్నాయని..

ఇక మంత్రి మల్లారెడ్డి తన గురించి ఎలా చెప్పుకుంటారో సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మేము ఫేమస్ ప్రమోషన్ కార్యక్రమంలో కూడా తాను కూడా ఊరికే ఫేమస్ అవ్వలేదని, ఆయన ఎలా కష్టపడ్డారో చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల సినిమాల్లో తనకు కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో ఒక పాత్ర కోసం గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దాదాపు గంటసేపు బతిమిలాడాడని ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.

ప్రభాస్ కంటే అందంగా..

ప్రభాస్ కంటే అందంగా..

ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి మల్లారెడ్డి. మేము ఫేమస్ హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ ను పొగుడుతూ ప్రశంసలు కురిపించారు. సుమంత్ ఇద్దరు హీరోల పేర్లు పెట్టుకున్నందుకు అభినందించిన మంత్రి మల్లారెడ్డి అతను చూడటానికి ప్రభాస్ కంటే అందంగా ఉన్నాడని చెప్పారు. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

అరుపులు కేకలతో..

"అసలు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ గా ఉన్నాడు. సూపర్ స్మార్ట్. నేను రియల్ గా చెబుతున్నా. ప్రభాస్ అంటే బోలేడు మేకప్ వేసుకుని ఉంటాడు. ఇతను నేచురల్ గా మేకప్ లేకుండానే ఎంత స్మార్ట్ గా ఉన్నాడయ్యా. తెలంగాణ మోడల్ అయ్యా.. తెలంగాణ బిడ్డ. రేపు దుమ్ము లేపుతడు" అని షాకింగ్ గా మాట్లాడారు మంత్రి మల్లారెడ్డి. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఏఎంబీ థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది. అయితే ఈ వాఖ్యలను పలువురు విమర్శిస్తున్నారు. "నిన్ను మల్లారెడ్డి కాలేజీ ముందే తొక్కుతరు జాగ్రత్త" అంటూ పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X