Animal: అంతా ఇక్కడికి రావాల్సిందే... రణ్‌బీర్‌ కపూర్‌కు మంత్రి మల్లారెడ్డి ధమ్కీ

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన చిత్రం యానిమల్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించిన ఈ చిత్రం.. డిసెంబర్ 1న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లే ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో మహేశ్ బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతే కాదు.. మంత్రి మల్లారెడ్డి ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో.... బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఎట్టకేలకు ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

Minister Malla Reddy Speech About Rajamouli, Mahesh Babu, Ranbir Kapoor At Animal Movie Pre Release Event Full Details Here

ఇక ఈ సినిమాను భూషణ్ కుమార్ అండ్ క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో దిల్ రాజ్ యానిమల్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరిపారు.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు. ఇక వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సైతం స్పెషల్ గెస్ట్ గా వచ్చి.. అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఇక మంత్రి మల్లారెడ్డి స్పీచ్ విన్న మహేశ్ బాబు మాత్రం నవ్వు ఆపుకోలకేపోయారు. బిజినెస్ మ్యాన్ సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చా అని చెప్పడం హైలెట్ గా నిలిచింది.

Minister Malla Reddy Speech About Rajamouli, Mahesh Babu, Ranbir Kapoor At Animal Movie Pre Release Event Full Details Here

మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ యూనిట్ వచ్చింది. మహేష్ బాబు గారు... నేను మీ సినిమా బిజినెస్ మేన్ చూసి రాజకీయాల్లోకి వచ్చా... ఆ సినిమా 10 సార్లు చూసి ఎంపీ అయ్యాను అంటూ చెప్పుకువచ్చాడు మంత్రి. ఇక రణబీర్ కపూర్ కు నేనొక విషయం చెప్తాను... అప్పట్లోనే నేను చెప్పాను.. బాలీవుడ్, హాలీవుడ్ ను తెలుగు హీరోలు రూల్ చేస్తారని.. మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు.. ఇప్పుడు సందీప్ వచ్చాడు అంటూ చెప్పుకువచ్చాడు.

ఇక హాలీవుడ్, బాలీవుడ్ ను హిందుస్థాన్ రూల్ చేస్తోంది. హైదరాబాద్ అందులో టాప్ మోస్ట్.. ఇక ముంబై నగరం పాతదైపోయింది.. అంతా ఇక్కడికి రావాల్సిందే... మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 500 కోట్లు కలక్షన్స్ వస్తాయి .. పక్కా.. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X