Malla Reddy సినీ మత్తులో మంత్రి మల్లారెడ్డి.. ఎన్నికల ప్రచారంలో మల్లన్న లీలలు!

రాజకీయాల్లో పొలిటికల్ లీడర్ అనూహ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం చాలా కష్టం. సినీ తారలకు మంచిన క్రేజ్ ఉండటం కేవలం తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మాత్రమే ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే రాజకీయ వేదిక గానీ.. సినిమా ఈవెంట్‌ గానీ.. మల్లన్న మాట్లాడితే.. యూట్యూబ్‌లో వీడియోలు ట్రెండింగ్ కావాల్సిందే. అలాంటి మల్లారెడ్డి తన కంటూ ప్రత్యేక ఆకర్షణను సంతరించుకొన్నారు. అలాగే ప్రజా జీవితంలో తన కంటే మార్కుతోపాటు బ్రాండ్ క్రియేట్ చేసుకొన్నారు. అయితే తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయన చూపిస్తున్న జోరు వివరాల్లోకి వెళితే...

స్కూల్స్, కాలేజీలతో విద్య రంగానికి సేవ చేస్తూ.. రాజకీయాల్లో బిజీగా ఉండే మల్లారెడ్డికి సినిమా యాక్టర్‌కు ఉన్న ఫాలోయింగ్ ఉంది. సినిమా వేదికలపై ఇచ్చే ఆయన స్పీచ్‌లు భారీ ప్రమోషన్స్ అందించడంతో చీఫ్ గెస్టుగా ఆయనను విపరీతంగా కోరుకొంటున్నారు. పలు సినిమాలకు ఆయన వచ్చి చేయూత నిచ్చారు.

Minister Malla Reddys Teenmar band style Election Campaign trending in Social media

అయితే తెలుగు సినిమా రంగంలో వినూత్నమైన ప్రచారంతో ఆకట్టుకొన్న చిత్రం మేము ఫేమస్. ఆ సినిమా కోసం తీన్మార్ బ్యాండ్‌తో చేసిన ప్రచారం అందర్నీ ఆకట్టుకొన్నది. సినిమాపై భారీ క్రేజ్ పెంచింది. అలాంటి ప్రచారాన్ని తన ఎన్నికల క్యాంపెయిన్ కోసం మల్లారెడ్డి వాడుకోవడం ఆసక్తికరంగా మారింది. మల్లన్న చేస్తున్న ప్రచారం భారీ చర్చకు దారి తీస్తున్నది.

తీన్మార్ బ్యాండ్ ప్రచారంతో మల్లారెడ్డి ప్రచారం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 'అందరికి 30 తారీఖు వేలుకు ఇంక్.. ఆ తర్వాత స్టేట్ అంతా పింక్', 'అప్పుడెట్టుండే తెలంగాణ.. ఇప్పుడెట్లుంది తెలంగాణ..', 'మా సీఎం చంద్రశేఖర్ రావు.. వాడికి ఓట్లేస్తే ఉద్యోగాలు రావు..' అంటూ బ్యాండ్‌తో హంగామా చేస్తున్నారు.

ప్రస్తుతం మల్లారెడ్డి ఎంచుకొన్న ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతున్నది. ఆయన వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఆయన నోటి నుంచి వస్తున్న పంచ్ డైలాగ్స్‌ రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పడుతాయి.. ఏ రేంజ్ మెజారిటీ తనకు లభిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X