twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టా? వర్మ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని జబర్దస్త్ కౌంటర్

    |

    సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు, ప్రత్యేక షోల ప్రదర్శనల వ్యవహారంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ లేవనెత్తిన ప్రశ్నలకు ఏపీ మంత్రి పేర్ని నాని కాస్త సమయం తీసుకొన్నప్పటికీ.. ఘాటుగానే జవాబిచ్చారు. ఆర్జీవి లేవనెత్తిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తనదైన శైలిలో స్పందించారు. వర్మ చేసిన కొన్ని వరుస ట్వీట్లకు సీరియల్ ట్వీట్ల ద్వారా రిప్లై ఇస్తూ తన సమాధానాలను వ్యక్తీకరించారు. పేర్ని నాని చేసిన ట్వీట్లు ఏమిటంటే..

    వర్మ గారు.. కొనేవారికా? అమ్మేవారికా?

    వర్మ గారు.. కొనేవారికా? అమ్మేవారికా?

    నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు తగ్గిస్తే రైతులకు ధైర్యం కోల్పోతారు అని వర్మ చేసిన ట్వీట్‌పై పేర్నీ నాని స్పందిస్తూ.. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ అని ట్వీట్ చేశారు.

    సినిమా నిత్యావసర వస్తువు కాదు..

    సినిమా నిత్యావసర వస్తువు కాదు..

    పేదలకు సినిమా నిత్యావసర వస్తువుగా భావిస్తే సబ్సిడీ ఇవ్వవచ్చు కదా అంటూ వర్మ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి పేర్ని నాని సమాధానం ఇస్తూ... సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే... మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు RGVzoomin గారూ. అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి అని సమాధానం ఇచ్చారు.

    హీరోల రెమ్యునరేషన్లపై

    హీరోల రెమ్యునరేషన్లపై

    సినీ హీరోలకు చెల్లించే పారితోషికం సినిమా నిర్మాణ వ్యయంలో భాగమని, దానిని సపరేట్‌గా చూడలేం అంటూ వర్మ చేసిన ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు RGVzoomin గారూ అని అన్నారు.

    సినిమా వినోద సేవ మాత్రమే

    సినిమా వినోద సేవ మాత్రమే

    వస్తువు ధరను నిర్ణయించడంలో మీ ప్రభుత్వ పాత్ర ఏమిటో సెలవు ఇవ్వండి అంటూ వర్మ చేసిన కామెంట్‌పై మంత్రి పేర్ని నాని సమాధానం ఇస్తూ.. ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే. ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    వర్మ గారు.. అలా ప్రవచించడం సరికాదు..

    వర్మ గారు.. అలా ప్రవచించడం సరికాదు..

    మీకు అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు. మీ పాలన నచ్చలేదంటే.. మీరు దిగిపోతారా అంటూ వర్మ చేసిన కామెంట్‌పై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అని మంత్రి పేర్ని నాని వరుస ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

    Recommended Video

    AP Ticket Rates: RGV Questions To AP Govt | CM Jagan | Oneindia Telugu
    పేర్ని నాని కౌంటర్‌పై వర్మ స్పందిస్తారా?

    పేర్ని నాని కౌంటర్‌పై వర్మ స్పందిస్తారా?


    ప్రముఖ ఛానెల్‌లో సోమవారం మంత్రి పేర్ని నానితో చర్చ అనంతరం రాంగోపాల్ వర్మ తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోను రిలీజ్ చేయడమే కాకుండా మంగళవారం ఉదయం వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు. వర్మ చేసిన ట్వీట్‌కు బదులిస్తూ.. పేర్ని నాని ఘాటుగా సమాధానాలు వచ్చారు. పేర్ని నాని సమాధానాలకు వర్మ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    English summary
    Ram Gopal Varma satires on Minister Perni nani. He tweeted that Dear honourable minister of cinematography perni_nani Sir, I would request you to understand that your government has been given power to support from the bottom and not to sit on the top of our heads ..Thank you very much Folded hands. In tthis occasion, Minister Perni Nani gives counter To RGV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X