APలో 20 శాతం షూటింగ్ చేస్తేనే కొత్త హైక్స్, 5 షోల పర్మిషన్.. రాధేశ్యామ్, RRR పరిస్థితి ఏమిటంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గడచిన రెండేళ్లలో ఒకవైపు కరోనా ఇబ్బంది పెట్టగా మరొకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించడంతో సినిమా పరిశ్రమ తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. పేదవారికి కూడా వినోదం తక్కువ ధరకే అందాలి అనే ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించారు అనే వాదన వినిపించినప్పటికీ ఆ విషయం చాలా రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మొదలైన టిక్కెట్ల రేట్ల వివాదం మళ్లీ భీమ్లా నాయక్ సినిమా వరకు కొనసాగింది.
Recommended Video

పవన్ కళ్యాణ్ రెండు సినిమాలపై..
పవన్ కళ్యాణ్ రెండు సినిమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్రస్థాయిలో బిజినెస్ ను దెబ్బతీశాయి అనే చెప్పాలి. ఇక ఫైనల్ గా రీసెంట్ గా మరొక కొత్త గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఒక విధంగా ఈసారి చిన్న సినిమాలకు కూడా లాభదాయకంగా ఉండేలానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్పెషల్ ఫోకస్
వఖిల్ సాబ్ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు విషయంపై కొత్త నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ సినిమా పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాల్లో వకీల్ సాబ్ సినిమా నష్టపోయింది. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమాపై కూడా అదే తరహాలో ప్రభావం పడింది. ఒక విధంగా కళ్యాణ్ పై స్పెషల్ ఫోకస్ చేసినట్లు అనేక రకాల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

చిన్న సినిమా పోటి పడితే..
అయితే ఆరోపణలు ఎన్ని వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీపై వివిధ రకాల నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతోంది. రోజుకి ఐదు షోల పర్మీషణ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పెద్ద సినిమాలతో చిన్న సినిమా పోటి పడితే మాత్రం ఆ టైం లో ఒక షోని చిన్న సినిమాకి కచ్చితంగా ఇచ్చి తీరాలి అని కొత్త జీవోలో పేర్కొన్నారు.

20% షూటింగ్ AP లోనే..
రెమ్యునరేషన్ల పరంగా కాకుండా 100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఎలాంటి సినిమా వచ్చినా కూడా వాటికి ముందుగా 10 రోజుల పాటు టికెట్ హైక్స్ ఎక్కువ ఉండాలి. ఇక మరో 20% షూటింగ్ AP లో జరిగి ఉండాలి అని కొత్త జీవో ద్వారా చెబుతున్నారు. ఈ విషయంలో ఇండస్ట్రీలో అయితే అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ షూటింగ్స్ కు అనుకువుగా ఉందని, అయినా సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా షూటింగ్స్ చేసుకోవాలి గాని కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే షూట్ చేయడం ఎంత మాత్రం భావ్యం కాదని అంటున్నారు.

రాధేశ్యామ్, RRR
అయితే రిలీజ్ సిద్ధంగా ఉన్న రాధేశ్యామ్, RRR రెండు సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్ 20% షూటింగ్ జరుపుకోలేదు. ఇక ఈ రెండు పెద్ద సినిమాలు కాబట్టి ఈ రూల్ ను మినహాయిస్తూ కొత్త హైక్స్, 5 షోల పర్మిషన్ ఉంది. కానీ ఇక పై రాబోయే సినిమాలకి 20% ఆంధ్రాలో కచ్చితంగా షూటింగ్ చేసి ఉండాలి.. అని మంత్రి పేర్ని నాని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











