twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ కిరాణం కొట్టు చూశాడో తెలియదు.. నాని, సిద్దార్థ్‌ కామెంట్లపై మంత్రి నాని ఘాటుగా సెటైర్లు

    |

    ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల ప్రదర్శన విషయంలో వివాదం కొనసాగుతున్నది. సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించారనే ఆరోపణలపై సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. RRR, రాధే శ్యామ్ సినిమాలకు ముందు విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్‌లో సినీ హీరో నాని ఘాటైన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయితే నాని వ్యాఖ్యల నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ..

    ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల సమస్యలపై

    ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల సమస్యలపై

    సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు తమను కలిసి వారి సమస్యలను చెప్పుకొన్నారు. టికెట్ రేట్లు పెంచమని చెప్పారు. అయితే వారి సూచనలు, విన్నపాలను పరిగణనలోకి తీసుకొన్నాం. ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సినీ ప్రముఖులతో మాట్లాడి సోమవారం కమిటిని ఏర్పాటు చేశాం. వివిధ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలనలోకి తీసుకొంటున్నాం అని మంత్రి పేర్ని నాని తెలిపారు.

    అనుమతుల్లేని థియేటర్లపై చర్యలు

    అనుమతుల్లేని థియేటర్లపై చర్యలు


    సినిమా ప్రదర్శించడానికి లైసెన్స్ తీసుకొకుండా నడిపే 130కిపైగా థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొన్నాం. చిత్తూరులో 24, కృష్ణా జిల్లాలో 12 సీజ్ చేసాం. లైసెన్స్ లేని వాళ్ళు 22 థియేటర్లు మూసేశారు. తొమ్మిది జిల్లాలో మొత్తం 83 సీజ్ చేశాం. 23 థియేటర్ యాజమాన్యాలపై జరిమానా విధించాం. జీవో 35ని ఏప్రిల్ 2021లో వచ్చింది. కానీ ఇప్పుడు దానికి నిరసనగా థియేటర్ల మూసివేసి నిరసన తెలపడం ఏమిటి? అని పేర్ని నాని అన్నారు.

    నాని ఏ కిరాణం కొట్టు లెక్కించాడో..

    నాని ఏ కిరాణం కొట్టు లెక్కించాడో..

    సినిమా థియేటర్ కౌంటర్ కంటే.. పక్కనే ఉన్న కిరాణం కొట్టు కౌంటర్‌లో ఆదాయం ఎక్కువగా ఉందని సినీ హీరో నాని చేసిన కామెంట్లపై మంత్రి నాని వ్యంగ్యాస్త్రాలను విసిరారు. ఆయన ఏ సినిమా థియేటర్ పక్కన కిరాణ కొట్టు కౌంటర్‌ను చూశాడో.. ఎక్కడి కిరాణం కొట్టు కౌంటర్‌ను లెక్కించాడో తెలుసుకొన్నాక నేను మాట్లాడుతాను. ఆయన వ్యాఖ్యలు చేశారంటే నాని బాధ్యతాయుతంగానే స్పందించి ఉంటారని అనుకొంటున్నాను అని పేర్ని నాని అన్నారు.

    సిద్దార్థ్ ఏపీలో ట్యాక్స్ కట్టడం లేదు కదా..

    సిద్దార్థ్ ఏపీలో ట్యాక్స్ కట్టడం లేదు కదా..

    ఇక హీరో సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. సిద్దార్థ్ తమిళనాడులో ఉంటారు. కాబట్టి ఆయన సీఎం స్టాలిన్ గురించి కామెంట్ చేసి ఉంటారు. తమిళనాడులో ఉండే హీరో ఏపీలో ట్యాక్స్ కట్టడం లేదు కదా.. రాజకీయ నాయకులు విలాసంగా బతుకుతున్నామని చెప్పిన ఆయన మా ఇంట్లోకి, సచివాలయంలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆయన బహుశా స్టాలిన్ లేదా ప్రధాని మోదీ గురించి మాట్లాడి ఉంటాడు అని సెటైర్ వేశాడు.

    Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Filmibeat Telugu
    సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు

    సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్లు


    ఏది ఏమైనా సినిమా టికెట్ రేట్లు సామాన్యడికి అందుబాటులో ఉండే విధంగా, ఇబ్బంది లేకుండా ఉండేలా నిర్ణయం తీసుకొంటాం. హైకోర్టు ఆదేశం మేరకు కమిటీని నియమించాం. త్వరలో చర్చలు జరుపుతాం. సినిమా స్టేక్ హోల్డర్ల నుంచి సభ్యులను నియమించాం. అందరి విజ్ఞప్తిను పరిగణలోకి తీసుకుంటాం. ప్రజలకి, సామాన్యుడికి భారం పడకుండా ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. పరిశ్రమ సమస్యలన్నింటిని కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని పేర్ని నాని చెప్పారు.

    English summary
    Andhra Pradesh Cinemotography minister Perni Nani met Film exhibitors in Amaravathi. In this occassion, He take shot pots on Actor Nani, Actor Siddarth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X