RGV Vyooham: ఆ సైకోలకు ప్యాంట్లు తడిచాయి.. పవన్ కల్యాణ్‌కు వెన్నుపోటు.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఇక ఈ సినిమా డిసెంబర్ 29న థియేటర్లోకి రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంత చేసిన మేకర్స్... తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్ లో వైసీపీ మంత్రి రోజాతో పాటు పలువరు ఏపీ మంత్రులు పాల్గొన్నారు. మంత్రి రోజా ఈ ఈవెంట్లో వ్యూహం సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
మంత్రి రోజా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ... వ్యూహం సినిమా దర్శకుడికి ప్రత్యేక అభినందనలు చెప్పింది. విజయవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ అని తెలిపింది. శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి... బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ అని మంత్రి రోజా కొనియాడారు. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనమని వెల్లడించింది. 'వ్యూహం' టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయిందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ 'వ్యూహం' అంటూ చెప్పుకువచ్చారు. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్ గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడని గుర్తు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు.

చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారని రోజా మండిపడింది. వ్యూహం సినిమా పేరుతో పచ్చ సైకొలకు తడిసిందని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. వ్యూహం టీజర్ చూసి చంద్రబాబుకు వణకు పుట్టిందని తెలిపారు. అయితే 'వ్యూహం' చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇక ఈ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. చంద్రబాబును నేను గుర్తించింది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినపుడు మాత్రమేనని తెలిపాడు. NTR చనిపోయిన తర్వాత ఇపుడు ఆయనే గొప్ప అని చెప్పటానికి కారణం ఆయన ఫ్యాన్స్ కోసమేనని చెప్పుకువచ్చాడు. చంద్రబాబు, లోకేష్ నిత్యం చేసేది జగన్ ను తిట్టడమేనని వెల్లడించాడు. అలాంటి లోకేష్ తమని తిడుతున్నామని పిటిషన్ వేయటం జోక్ అని వెల్లడించాడు.

ఇక పవన్ ఓ రంగుల రాజా అంటూ ఎద్దేవా చేశాడు. ఊరు పేరు తెలియని బర్రెలక్క పోటీ చేసి ఫేమస్ అయిందన్నారు. పవన్ ఓ బర్రె లెక్క చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారని చెప్పుకువచ్చాడు. లోకేష్ ఎక్కడ గెలవలేడు.. చంద్రబాబు కొడుకు కాకుండా చూస్తే నథింగ్.. లోకేష్ ది ఎర్ర బుక్కా... ఎర్రి బుక్కా.. ఈ సినిమా ద్వారా కొందరు రాజకీయ పార్టీ నేతల వ్యక్తిత్వం బట్టలు ఊడ తీస్తున్నా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


Click it and Unblock the Notifications











