twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి చేయండి మంత్రి గారు.. వృద్ధుడి వింత కోరికకు మినిస్టర్ రోజ సమాధానం ఏంటో తెలుసా?

    |

    సినీ తారలకు, రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళితే వారికి పట్ల చూపించే ఆదరణ, గౌరవం మాటల్లో చెప్పలేం. తమ అభిమాన నేత తమ ముందుకు వస్తే అభిమానులు వింత కోరికలు కోరడం చూస్తూనే ఉంటాం. అలాంటి కోరికే ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాకు ఎదురైంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరూ ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకోవడం, వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా అనే విషయాన్ని వారి నుంచి రాబట్టడం జరుగుతున్నది.

    అయితే ఇటీవల మంత్రి పదవిని దక్కించుకొన్న రోజా తన జిల్లాలో పర్యటిస్తున్నారు. గడప గడపకు వెళ్లి ప్రజల యోగ క్షేమాలు తెలుసుకొంటున్నారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడిని రోజా పలకరించింది. వృద్ధుడు కోరిన కోరిక విని మంత్రి రోజా నవ్వుల్లో మునిగిపోయింది.

    Minister Roja gets funny request from Old Age person in Chittor

    చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చేరుకొన్న రోజా ఆ ప్రాంతంలోని ప్రజలను కలుసుకొన్నారు. ప్రతీ ఒక్కరిని ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది చేకూరుతున్నాయా అని అడిగితే ప్రజలు సమాధానం చెప్పారు. అయితే ఓ వృద్ధుడిని పింఛన్ వస్తుందా అని అడిగితే.. వస్తున్నది అని సమాధానం చెప్పాడు. ఆరోగ్యం బాగుందా అంటే బాగుందని చెప్పాడు. అయితే తనకు భార్య లేదని, తనకు పెళ్లి చేయించమని రోజా ముందు తన కోరికను బయటపెట్టాడు. దాంతో రోజా అవాక్కయింది.

    వృద్ధుడి కోరికకు సమాధానం చెబుతూ.. ప్రభుత్వం తరఫున ఫించను కావాలంటే ఇప్పిస్తాం. కానీ పెళ్లి అంటే మాతో కాదు. పెళ్లి మేము చేయించలేం అని ఆ వృద్ధుడి కోరికను రోజా సున్నితంగా తిరస్కరించారు. వృద్ధుడి కోరికను విన్న గ్రామస్థులు, రోజా వెంట ఉన్న కార్యకర్తలు కూడా నవ్వుల్లో మునిగిపోయారు.

    వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు ఇటీవలే సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవిని కట్టబెట్టారు. మంత్రిగా తనదైన శైలిలో ప్రజల సమస్యలపై స్పందిస్తూ ముందుకెళ్తున్నారు.

    English summary
    Andhra Pradesh Minster Roja is visiting Gadapa Gadapaku Program in Chittor, In this occassion, Minister Roja gets funny request from Old Age person
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X