పవన్ కల్యాణ్ తో బొత్స సినిమా
హైదరాబాద్:విజయనగరం జిల్లాలో మగధీర సినిమాపై నిషేధ ప్రకటన చేసి మంత్రి బొత్స కలకలం కలిగించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన తర్వాత మళ్లీ చిరంజీవితో సంబంధాలను యథాస్థితికి తెచ్చే ఉద్దేశంతోనే భేటీ జరిపారని పీఆర్పీ వర్గాలు భావిస్తున్నాయి. ఆంజనేయులు సినిమా బాగా ఆడాలనే మగధీర సినిమాను మీ జిల్లాలో నిషేధించినట్లున్నారే అన్న ప్రశ్నకు ఆ రెండు సినిమాలకు ఏ సంబంధం లేదని బొత్స సమాధానమిచ్చారు.
'మగధీర సినిమాను నిషేధించలేదు. థియేటర్లను నిషేధించాం. తొక్కిసలాటలో కొందరు చనిపోతే సినిమా నిర్మాత కూడా కొంత ఆదుకోవాలి. అల్లు అరవింద్‌కు పద్నాలుగుసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు. తప్పని స్థితిలో అలా చేయాల్సి వచ్చింది' అని చెప్పారు. ఆంజనేయులు సినిమాకు తనది కేవలం సాంకేతిక సహకారం మాత్రమేనని చెప్పారు.
తర్వాత పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వచ్చి ఆంజనేయులు సినిమా ద్వారా నిర్మాత అయినందుకు అభినందనలని అన్నారు. తన తర్వాతి సినిమా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్‌తోనేనని ఆయన గంటాతో చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన మిత్రుడు, గంటా శ్రీనివాసరావుతో కలిసి అసెంబ్లీ ఆవరణలో చిరంజీవి వద్దకు వెళ్లి కాసేపు కూర్చున్నారు. కరువుపై బాగా మాట్లాడావంటూ కేశవ్‌ను చిరంజీవి అభినందించారు.


Click it and Unblock the Notifications











