twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీలపై కేంద్రం సంచలన నిర్ణయం: అలాంటివి చూసే వాళ్లకు బ్యాడ్ న్యూస్.. ఇకపై అవి కనిపించవు!

    |

    టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న వేళ.. డిజిటల్ మీడియా రంగం విస్తృతం అవుతోంది. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి బోలెడు ఓవర్ ద టాప్ (ఓటీటీ) ఫ్లాట్‌ఫామ్స్ పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్లి సినిమా చూసే పరిస్థితులు తగ్గిపోయాయి. అరచేతిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ సహా ఎన్నో ఓటీటీలు ఉండడంతో తమకు నచ్చిన కంటెంట్‌ను ఇష్టం వచ్చిన సమయంలో చూసేస్తున్నారు. ఇందుకు ప్రీమియంలు చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఇప్పుడు ఓటీటీ సంస్థలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

    ఇండియాలో నలభై.. ముఖ్యమైనవి ఇవే

    ఇండియాలో నలభై.. ముఖ్యమైనవి ఇవే

    నాలుగైదేళ్లుగా భారతదేశంలో డిజిటల్ మీడియా వాడకం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఎన్నో సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఇండియాలో ప్రస్తుతం 40కి పైగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా వీడియో, జీ5, ఆల్ట్ బాలాజీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సహా ఎన్నో ఓటీటీలు సందడి చేస్తున్నాయి.

    ఒక్కో దానికి ఒక్కో రేటు.. పలు రకాలు

    ఒక్కో దానికి ఒక్కో రేటు.. పలు రకాలు

    ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు సహా ఎన్నో రకాల కంటెంట్లు అందుబాటులో ఉంటాయి. వాటిని చూడాలంటే ప్రేక్షకులు ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కో సంస్థకు ఒక్కో రకంగా ఉంది. కొన్ని సంవత్సరం మొత్తనికి రేటు ఫిక్స్ చేయగా.. మరికొన్ని మాత్రం మూడు నెలలకో, ఆరు నెలలకో ప్రీమియంను అందుబాటులో పెడుతున్నాయి. డిమాండ్‌ను బట్టి రేటు ఉంటుంది.

    లాక్‌డౌన్‌తో పెరిగిన డిమాండ్... పోటీగా

    లాక్‌డౌన్‌తో పెరిగిన డిమాండ్... పోటీగా

    ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ శకం నడుస్తున్న కారణంగా చాలా మంది వాటి వైపు మళ్ళుతున్నారు. బిజినెస్ పరంగా కొందరు ఫిల్మ్ మేకర్లు వాటికి ఆకర్షితులు అవుతుంటే.. కంటెంట్ కోసం ప్రేక్షకులు వీటిని ఆశ్రయిస్తున్నారు. ఇక, లాక్‌డౌన్ పుణ్యమా అని వీటి వాడకం ఇండియాలో మరింత ఎక్కువైంది. దీంతో సంస్థలు పోటాపోటీగా చిత్రాలను రూపొందిస్తున్నాయి.

    అలాంటి వాళ్లకు మరింత నచ్చే విధంగా

    అలాంటి వాళ్లకు మరింత నచ్చే విధంగా

    ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సెన్సార్ ఉండదు. దీంతో మామూలు వాటితో పోల్చుకుంటే అక్కడ ప్రసారం అయ్యేవి పచ్చిగా ఉంటాయి. రొమాంటిక్ సీన్లు, బూతు డైలాగులు, రక్తపాతం ఉన్న సన్నివేశాలు మొదలైనవి వీటిలో యధాతధంగా చూపించేస్తారు. అందుకే అడల్ట్ కంటెంట్‌ను చూసే వాళ్ల కోసం మరింత రసభరితమైన కంటెంట్‌ పెడుతున్నారు.

    ఓటీటీలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

    ఓటీటీలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

    సినీ రంగంపై నియత్రణ కోసం ఎప్పుడో ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అది తయారు చేసిన గైడ్‌లైన్స్ ప్రకారమే సెన్సార్ బోర్డు సినిమాలకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అయితే, ఓటీటీలకు మాత్రం అలాంటివి ఏమీ లేవు. ఈ నేపథ్యంలో 21 మంది పార్లమెంట్ సభ్యులు ఓటీటీల్లో చూపిస్తోన్న కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

    అలాంటివి చూసే వాళ్లకు బ్యాడ్ న్యూస్

    అలాంటివి చూసే వాళ్లకు బ్యాడ్ న్యూస్

    రొమాంటిక్ సీన్లు, బూతులు, క్రైమ్ సంబంధిత సన్నివేశాలు చూపించే ఓటీటీపై చర్చలు తీసుకోవాలంటూ ఎంపీలు చేసిన డిమాండ్ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు బ్రాడ్‌కాస్టింగ్ మినిష్టర్ ప్రకాశ్ జవడేకర్ త్వరలోనే ఓటీటీల కోసం ప్రత్యేక గైడ్‌లైన్స్‌ను తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దానికి సంబంధించిన పని జరుగుతుందని చెప్పారు.

    అదే జరిగితే.... ఇకపై అవి కనిపించవు

    అదే జరిగితే.... ఇకపై అవి కనిపించవు

    సినిమాలకు సెన్సార్ మాదిరిగా.. ఓటీటీలకు ప్రత్యేక నియమ నిబంధనలు రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అదే జరిగితే.. ఇకపై రొమాంటిక్ సీన్లు, బూతు డైలాగులు, రక్తపాతాలు లాంటివి కనిపించవు. ఒకవేళ ఉన్నా వాటికి తగిన మినహాయింపులు విధిస్తారు. దీంతో అలాంటి వాటి కోసమే ఓటీటీలను ఆశ్రయించే వాళ్లందరికీ ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూసే అని చెప్పాలి.

    English summary
    Allu Aravind is an Indian film producer and distributor in Tollywood. He produces films under his production banner Geetha Arts. He is one of co-owner of the Indian Super League club Kerala Blasters FC. Aravind is the son of Telugu actor Allu Rama Lingaiah.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X