లెజెండ్ టూర్: బాలయ్య బస్సుకు ప్రమాదం! (ఫోటోలు)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తాజా సినిమా 'లెజెండ్' సినిమా విజయోత్సవంలో భాగంగా ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురంలో బాలయ్య పర్యటన సాగుతుండగా చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. బాలయ్య ప్రయణిస్తున్న బస్సు మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
అభిమానులు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు రావడంతో బాలయ్య ప్రయాణిస్తున్న బస్సు ముందు ఉన్న సఫారీ వాహనం సడన్ బ్రేక్ పడింది. దీంతో బాలయ్య ప్రయాణిస్తున్న బస్సు సఫారీ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే సఫారి వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
బాలయ్య ప్రయాణిస్తున్న బస్సు ఢీకొట్టిన సఫారీ వాహనం ధ్వంసమైన దృశ్యంతో పాటు, బాలయ్య విజయ యాత్రకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

ధంసమైన సఫారీ వాహనం
లెజెండ్ సక్సెస్ టూర్లో జరిగిన చిన్నపాటి యాక్సిడెంటులో ధ్వంసమైన సపారీ వాహనం. అనంతపురంలోని నేషనల్ హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది.

అనంతపురంలో బాలయ్య
లెజెండ్ సింహ యాత్రలో భాగంగా అనంతపురంలో బాలయ్య పర్యటించారు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులకు అభివాదం చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

నేషనల్ హైవేపై...
అనంతపురంలోని నేషనల్ హైవేపై బాలయ్య రాక సందర్భంగా భారీగా అభిమానులు గుమిగూడారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

బాలయ్యకు నీరాజనాలు
బాలయ్య రాకతో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆయన్ను చూసేందుకు పోటీ పడ్డారు.

గెలుపు మనదే
లెజెండ్ సక్సెస్ టూర్ బాలయ్యకు రెండు రకాలుగా ఉపయోగ పడుతోంది. ఓ వైపు సినిమాకు ప్రచారం కలగడంతో పాటు.....తన రాజకీయ అరంగ్రేటానికి ప్లస్సయ్యేలా ఈ యాత్ర సాగుతోంది.


Click it and Unblock the Notifications











