షారుక్ ఖాన్ ఇంట్లో అగ్ని ప్రమాదం
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇంట్లో గురువారం రాత్రి చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించింది. ఇది చిన్న ఘటనే అని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని షారుక్ ఖాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ నెట్వర్కింగ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు శుక్రవారం ఉదయం సందేశం పంపారు.
'ఇంట్లో మంటలు చెలరేగాయి. ఎలా జరిగిందో తెలియదు. అయితే ఇంట్లో అంతా సేఫే. అన్ని డిపార్టుమెంట్స్ వెంటనే స్పందించినందుకు థాంక్స్' అంటూ షారుక్ ఖాన్ శుక్రవారం తెల్లవారు ఝామున ట్విట్టర్లో ట్వీట్ చేసారు. షారుక్ ఖాన్ ఈ విషయం గురించి ట్విట్టర్లో పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
అయితే షారుక్ ఖాన్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది చాలా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అని స్పష్టం అవుతోంది. ఎవరూ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. షారుక్ బెడ్రూంలో షాట్ షర్య్కూట్ వల్ల ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మంటలు చెలరేగిన వెంటనే అంతా అప్రమత్తం అవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.


Click it and Unblock the Notifications












