twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిరపకాయ సెంటిమెంట్ తో రవితేజ

    By Srikanya
    |

    రవితేజ తన మెరపకాయ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాడు. ఆ సెంటిమెంట్ ఏమిటంటే..మిరపకాయ చిత్రం క్రింత సంక్రాంతికి విడుదలై సక్సెస్ అయ్యింది. అలాగే అందులో హీరోయిన్ గా దీక్షాసేధ్ చేసింది. ఇప్పుడు ఆయన తాజా చిత్రం నిప్పు కూడా ఇదే సంక్రాంతికి విడుదల అవ్వబోతోంది. అందులో హీరోయిన్ గా దీక్షాసేద్ చేస్తోంది. దాంతో అదే రేంజి సక్సెస్ అవుతుందని,తన సెంటిమెంట్ వర్కవుట్ అవ్వుతుందని భావిస్తున్నాడు.ఈ మాస్ ఎంటర్టైనర్ గురించి అన్ని ఏరియాలనుంచి మంచి బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రం సీడెడ్ రైట్స్ ని మూడు కోట్లు ఇచ్చి తీసుకున్నారు. గతంలో ఆర్.ఆర్.మూవి మేకర్స్ పతాకంపై కిక్ వంటి సూపర్ హిట్ చిత్రం చేసారు రవితేజ.

    ఇక సంక్రాంతికి ఈ చిత్రం అనుకున్నట్లు విడుదల అయితే సీడెడ్ లో మంచి ఓపినింగ్స్ ఉంటాయని భావించి రైట్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం మళ్లీ గుణశేఖర్ కి పూర్వ వైభవం తీసుకొస్తుందని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌ దేవ్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డాన్స్‌: రాజు సుందరం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌.కిషోర్‌, కో-ప్రొడ్యూసర్స్‌: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.వి.యస్‌.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.

    English summary
    Nippu movie unit will be releasing the movie on 13th of January as Ravi Teja wants it to be released on that day itself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X