నైజాంలో రవితేజ 'మిరపకాయ' నాలుగు రోజుల షేర్ ఎంతంటే..
సంక్రాంతి కానుకగా విడదలైన రవితేజ...మిరపకాయ చిత్రం నైజాంలో మంచి కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్తున్నారు. అక్కడ నాలగు రోజులకీ 2.85 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ లో వినిపిస్తోంది. చిత్రం ఓపినింగ్స్ విపరీతంగా రావటం, మిగతా సినిమాలు ఈ మాత్రం కూడా బాగోకపోవటం ఈ చిత్రం విజయానికి కలిసివచ్చిందని విశ్లేషిస్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో మంచి హిట్ అవటం కూడా క్రౌడ్స్ ని ధియోటర్స్ కి పంపుతోంది. ఇక ఈ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రవితేజ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు.ఆయన...సంక్రాంతి బరిలో మా 'మిరపకాయ్' నిలిచి గెలిచింది అన్నారు. మా హీరో రవితేజగారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని, పాటలు సూపర్ అని, హరీష్‌శంకర్ టేకింగ్ అద్భుతమని అందరూ ప్రశంసిస్తున్నారు అన్నారు.


Click it and Unblock the Notifications











