రవితేజతో మిరపకాయ్ డైరెక్టర్ మళ్ళీ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఎల్లో ఫ్లవర్ బ్యానర్ పై నిర్మాత రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం 'మిరపకాయ్"..రీసెంట్ గా శతదినోత్సవం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళును రాబట్టిన విషయం తెలిసిందే..ఈ చిత్రం తర్వాత మళ్ళీ మాస్ మహరాజా రవితేజ, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఎల్లో ఫ్లవర్ బ్యానర్ పై నిర్మాత రమేష్ పుప్పాల ఓ భారీ ఎంటర్ టైనర్ ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు..
పూర్తి రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్"అనే టైటిల్ దర్శకుడు హరీష్ శంకర్ ఖరారు చేశాడట..ఈ సినిమా పూర్తి వివరాలని నిర్మాత రమేష్ పుప్పాల 'మిరపకాయ్" చిత్రం శతదినోత్సవ వేడుకలో వెల్లడించనున్నాడట..ప్రస్తుతం పవన్ 'గబ్బర్ సింగ్" చిత్రానికి దర్శకత్వం వహించనున్న హరీష్ శంకర్, మరో పక్క 'వీర" చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న రవితేజ వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" ఏరేంజ్ లో వుండబోతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











