వందరోజుల మిరపకాయోత్సవం...!
రవితేజ టైటిల్ పాత్రలో రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్, హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎల్లోఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మించిన 'మిరపకాయ్" అన్ని ముఖ్య కేంద్రాల్లో 100 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ 'మా బేనర్‌లో తొలిచిత్రమే పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది. బయ్యర్లకు, నిర్మాతకు భారీ లాభాలివ్వడమేగాక ప్రేక్షకులకు వందశాతం వినోదం పంచి ఈ ఏడాది సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఈ విజయానికి కారణమైన యూనిట్ సభ్యులకి, ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు" అన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'నాపై నమ్మకంతో అవకాశమిచ్చిన మాస్ మహారాజా రవితేజకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాతో సమానంగా శ్రమించిన విజయానికి కారణమైన చిత్రయూనిట్‌కు, రాజీలేకుండా నిర్మించి విజయానికి కారకుడైన నిర్మాతకి థాంక్స్" అన్నారు.
ఈ చిత్రంవలన సొమ్ములు చేసుకున్న బయ్యర్లు, పంపిణీదార్లు ఈ సంవత్సరంలో ఇది మొదటి హిట్ అని అంటూ సంతోషాన్ని వ్యక్తంచేసుకున్నారు. మిరపకాయ్ తో పాటు ఈ సంవత్సరం ఇంతవరకు సొమ్ములు చేసుకున్న చిత్రాలు 'అహా నా పెళ్ళంట",'అలా మొదలైయింది" సినిమాలు...


Click it and Unblock the Notifications











