రిలీజ్‌కి ముందే ‘మిర్చి’పాటల డౌన్‌లోడ్
హైదరాబాద్ : 'మిర్చి' ఆడియో వేడుక ఇంకా పూర్తి కానేలేదు...అతిథులు హాజరైన ఇంకా పాటలను విడుదల చేయనేలేదు. కానీ 'మిర్చి' సినిమా పాటులు ఇప్పటికే ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చాయి. పలు డౌన్ లోడింగ్ సైట్ల నుంచి పాటలు డౌన్ లోడ్ అవుతున్నాయి.
ఆ సంగతి తక్కన పెడితే...నేడు రామానాయుడు సినీ విలేజ్‌లో గ్రాండ్ గా ఆడియో రిలీజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి 7 గంటలకు ఆడియో రిలీజ్ మొదలు కానుంది. పలు తెలుగు టీవీ ఛానల్స్‌లో 'మిర్చి' ఆడియో వేడుక లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేసారు.
సంగీతం పరంగా 'మిర్చి' సినిమా పాటలు సంచలనం సృష్టిస్తాయని, గతంలో పభాస్, దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన వర్షం, మిస్టర్ పర్ ఫెక్ట్ మ్యూజికల్‌గా ఎంత హిట్ అయ్యాయో అంతకు మించిన స్థాయిలో పాటలుంటాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
అనుష్క, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రానికి సంభాషణలు అందించిన కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.
ట్రాక్ లిస్ట్
1. మిర్చి
2. యోహాన్ యోహాన్
3. ఇదేదో బాగుందే
4. పండగలా...
5. బార్బీగర్ల్
6. నీ చూపుల
7. డార్లింగే


Click it and Unblock the Notifications











