ప్రభాస్ ‘మిర్చి’ ఆడియో ట్రాక్ లిస్ట్
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'మిర్చి' ఆడియో జనవరి 5న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు సినీ విలేజ్ లో ఆడియో వేడుక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదలైంది.
ట్రాక్ లిస్ట్:
1. యోహాన్ యోహాన్
2. మిర్చి మిర్చి
3. బార్బీ గర్ల్
4. పండగలా...
5. కాటుక కళ్లు
6. డార్లింగ్
7. ప్రభాస్ రాక్ (థీమ్ రీ మిక్స్)
8. పొలిమేర బిట్
9. నీ చూపుల(బిట్)
ప్రభాస్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణాన్ని ఎక్కువమంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే...ఈ ఆడియో వేడుకకు మహిళా ప్రేక్షకులు హాజరయ్యేలా వారి కోసం ప్రత్యేక ఆడియో పాసులు రిలీజ్ చేసారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రానికి సంభాషణలు అందించిన కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











