అమెరికాలో ప్రభాస్ ‘మిర్చి’ సరికొత్త రికార్డ్
హైదరాబాద్ : యంగ్ రబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం అమెరికాలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అమెరికాలో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రంగా మిర్చి రికార్డుల కెక్కింది. ఈ చిత్రాన్ని అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం మొత్తం రెండు సెంటర్లలో ఈ చిత్రం విజయవంతంగా అర్ధ శతదినోత్సవం జరుపుకుంది.
అమెరికా న్యూజెర్సీ లో హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ప్రదర్శితం అయ్యే రీగల్ కామర్స్ సెంటర్లో మిర్చి చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో పాటు ఇక్కడ 7 వారాల కలెక్షన్స్ విషయంలో పలు హాలీవుడ్ సినిమాలను వెనక్కి తోసింది. కారీ అనే ప్రాంతంలో కార్మెక్ పార్క్ ప్లేస్ 16 ప్రాంతంలో కూడా మిర్చి చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు గ్రేట్ ఇండియా ఫిల్మ్ సంస్థ ప్రకటించింది.
'మిర్చి' చిత్రం ద్వారా కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











