నా అభిమానిగా వచ్చాడు, సినిమా తీస్తున్నాడు: బాలయ్య

By Bojja Kumar

హైదరాబాద్: అభిజిత్, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం మిర్చిలాంటి కుర్రాడు. బాలయ్యతో ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్న రుద్రపాటి రమణారావు ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై నిర్మించిన ‘మిర్చిలాంటి కుర్రాడు' చిత్రానికి జయనాగ్ దర్శకుడు. జెబీ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర గీతాలు గురువారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఆడియో సీడీలను హీరో బాలకృష్ణ ఆవిష్కరించారు. దర్శకుడు బోయపాటి శ్రీను తొలి ప్రతిని స్వీకరించడంతో పాటు ప్రచార చిత్రాలను విడుదల చేశారు. శ్రేయాస్ మ్యూజిక్స్ ద్వారా ఈ చిత్రం ఆడియో మార్కెట్లోకి విడుదలయ్యింది.

ఈ సందర్భంగా బాలయ్య నిర్మాత గురించి, సినిమా గురించి మాట్లాడారు. రుద్రపాటి రమణారావుగారు నా అభిమానిగా నా దగ్గరకు వచ్చారు. నాతో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా గురించి ఇప్పడే మాట్లాడను. అది ఎలా ఉంటుందో రేపు మీరే చూస్తారు అని తెలిపారు.

సినిమా గురించి మాట్లాడుతూ... 'మిర్చిలాంటి కుర్రాడు' ఓ మంచి సందేశం ఇస్తుందనే నమ్మకం ఉంది. డైరెక్టర్ కూడా సినిమాని చక్కగా తెరకెక్కించి ఉంటారని భావిస్తున్నాను. ఈ రోజు జె.బి ఈ ఆడియో వేడుక హీరో. పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. ఆడియో సినిమాపై ఇంప్రెషన్ కలుగజేస్తుంది. టైటిల్ బాగుంది. హీరో అభిజిత్, హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్ జంట చాలా బాగుంది. పాటలు హిట్టయితే, సినిమా హిట్టయినట్టే లెక్క. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

బాలయ్య ఆశీర్వదించారు

బాలయ్య ఆశీర్వదించారు

నిర్మాత రమణారావు మాట్లాడుతూ - ఈ సినిమా ట్రైలర్ చూడగానే బాలయ్యగారు బాగుందని ఆశీర్వదించారు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఆయన రావడం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. నందమూరి వారి అభిమానిని. ఎప్పటికైనా బాలయ్యగారితో సినిమా చేయాలని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ముందు చిన్న సినిమా చేసాను. ఇప్పుడు బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాను అన్నారు.

సినిమా గురించి నిర్మాత

సినిమా గురించి నిర్మాత

'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించాము. చిత్రీకరణ పూర్తయ్యింది. లవ్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. డైరెక్టర్ చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జె.బి చక్కటి పాటలిచ్చారు. అందరికీ ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది'' అని చెప్పారు.

చక్కటి లవ్ స్టోరీ

చక్కటి లవ్ స్టోరీ

డైరెక్టర్ జయనాగ్ మాట్లాడుతూ - ''చక్కటి లవ్ స్టోరీ. యాక్షన్ నేపధ్యం ఉన్న కథకు వినోదం, లవ్ జోడించాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ పూర్తయ్యింది. వీరబాబు డైలాగ్స్, జెబి మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అవుతాయి'' అని అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ

బోయపాటి శ్రీను మాట్లాడుతూ

సినిమా కలర్‌ఫుల్‌గా, పాజిటివ్‌గా ఉంది. ప్రచార చిత్రాలు, పాటలు చూస్తుంటే నాణ్యత విషయంలో నిర్మాత రాజీ పడనట్లు కనిపిస్తోంది అన్నారు. బాలకృష్ణతో సినిమా చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. ఆయనతో చేస్తున్న సినిమా నందమూరి అభిమానులందరికీ పండుగలా ఉంటుంది.

నటీనటులు

నటీనటులు

రావు రమేష్, నాగినీడు, సప్తగిరి, సుప్రిత్, రజిత, ప్రభాస్ శ్రీను తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

సంగీతం - జె.బి, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, కెమెరా - ఆర్.ఎం.స్వామి, మాటలు - వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రాజు, నిర్మాత - రుద్రపాటి రమణరావు, దర్శకత్వం - జయనాగ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X