twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మిర్చి’ సినిమానూ... వీడని వివాదాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య తెలుగు సినిమాలన్నీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో యంగ్ రెబల్ స్టార్ 'మిర్చి' చిత్రం కూడా వచ్చి చేరింది. ఈ చిత్రంలో కటిక, కసాయి అనే పదాలు ఉపయోగించడంపై ఆర్య కటిక కులానికి చెందిన వారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. అలాంటి పదాలను ఉపయోగించడం వల్ల తమ కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతింటున్నాయని, వెంటనే సినిమాలో ఆ పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఫిబ్రవరి 8న విడుదలైన 'మిర్చి' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపిస్తోంది. సినిమా స్టోరీలో కొత్తదనం లేక పోయినా.... ప్రభాస్ బ్రిలియంట్ అండ్ పవర్ ఫుల్, స్టైలిష్ పెర్ఫార్మెన్స్, కామెడీ సీన్లు ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిచేలా చేస్తోంది. దీనికి తోడు ప్రభాస్ స్టార్ ఇమేజ్ తో సరితూగే హీరోల సినిమాలేవీ బరిలో లేక పోవడం ప్లస్సయింది. పెద్ద హీరోల సినిమాలైన నాయక్, SVSCలు విడుదలై దాదాపు నెల రోజులు అవుతుండటంతో ఆయా థియేటర్లలో జన సాంద్రత తగ్గి మిర్చి థియేటర్లలో ఆడియన్స్ పెరిగారు.

    కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Controversy on Prabhas latest movie Mirchi. Few leaders from katika Porata Samithi had stormed in to Sandhya theater at RTC ‘X’ Roads and demanded the immediate removal of words like ‘Katika’ and ‘Kasayi’ from the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X