‘మిర్చి’ మూవీ హైలెట్స్ (ఫోటోలతో)
హైదరాబాద్: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'మిర్చి' మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. తమ అభిమాన హీరోకి భారీ కటౌట్స్ కట్టడం, బాజా భజంత్రీల సందడి మధ్య కొబ్బరికాయలు కొట్టడం, కటౌట్ల ముందు ప్రభాస్ సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేసారు.
మిర్చి చిత్రం ద్వారా రచయత కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈచిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు.
సినిమా వివశేషాలు, హైలెట్స్ విషయానికొస్తే...
ఈ చిత్రంలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉంది. అదే విధంగా ఈచిత్రంలో ప్రభాస్ పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కొన్నీ సీన్లలో ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రంలా క్లాస్ గా కనిపించినా మరి కొన్ని సన్ని వేశాల్లో పవర్ ఫుల్ పెర్పార్మెన్స్‌తో మాస్‌గా కనిపించారు.

దర్శకుడు కొరటాల శివ సినిమాలో ఫ్యామిలీ డ్రామాను మిలితం చేస్తూనే మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ... యూత్‌కు నచ్చే విధంగా యాక్షన్ హీరో ఇమేజ్‌ను కంటిన్యూ చేసాడు. ఎమోషన్‌తో కూడిన స్క్రిప్టును కమర్షియల్ వేలో నడిపి హిట్ కొట్టాలనే ప్రయత్నం చేసాడు.

సినిమా తొలి భాగం నేరేషన్ వేగంగా సాగుతూ ప్రేక్షకులకు కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సినిమా స్టోరీ చెబుతారని ఫ్రేక్షకులకు ముందే తెలిసి పోతుంది. సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు బోర్ తెప్పిస్తాయి.

ఇక దర్శకుడి రచయితగా మంచి అనుభవం ఉంది కాబట్టి అదరిపోయే డైలాగులు రాసాడు. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని ఆపుకోవాలి డూడ్', ‘వీలైతే ప్రేమించు...మహా అయితే తిరిగి ప్రేమిస్తారు', ‘కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవ్వడూ వాడలేడు' లాంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

యాక్షన్ సన్నివేశాల కంపోపింగ్ బాగుంది. ముఖ్యంగా ఈ సీన్లలో కెమెరా వాడిన తీరు బ్రిలియంట్ గా ఉంది. ప్రభాస్ దోతి ఫైట్ హైలెట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో హైలెట్.

మాది సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను బాగా చూపాడు. అనుష్క మరోసారి తన గ్లామర్ ఆరబోసింది. రిచా గంగోపాధ్యాయ్ ఫర్వాలేదనిపించింది.


Click it and Unblock the Notifications











