ప్రభాస్ ‘మిర్చి’ న్యూ ఫోటోస్.... అదిరాయ్
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'మిర్చి' చిత్రానికి సంబంధించిన న్యూఫోటోస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో హీరో ప్రభాస్ తో పాటు, హీరోయిన్లు అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ అదరిపోయే లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అదిరిపోతున్న ఈ స్టిల్స్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ... ప్రభాస్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కథ మీద కమాండ్‌తో దర్శకుడు కొరటాల శివ ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటుందని ఆశిస్తున్నామ'ని తెలిపారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

మిర్చి చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు.

ఫిబ్రవరి 8న ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు సిద్దం అయ్యాయి.

యూవి ప్రొడక్షన్స్ పతాకంపై వంశీకృష్ణ, ప్రమోద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఫిబ్రవరి 8న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











