షాకిచ్చిన ‘మిర్చి' పైరసీ సీడిలు
హైదరాబాద్ :ప్రభాస్ నటించిన 'మిర్చి' మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పైరసీకు అప్పుడే గురైంది. ఈ చిత్రం పైరసీ సీడీలను హైదరాబాద్ అప్జల్ గంజ్ ఏరియోలో సిటీ పోలీసులు పట్టుకున్నారు. ఎమ్.డి.కాసిం అనే వ్యక్తి ఈ పైరిసీ సీడిలు తయారు చేసి అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. రిలీజై నాలుగు రోజులు కాకుండానే అప్పుడే పైరసీ మార్కెట్లో వీర విహారం చేయటం సినీ వర్గాలను కలవరపరుస్తోంది.
మరో ప్రక్క ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో అదర గొట్టింది. ముఖ్యంగా ఈచిత్రం నైజాం ఏరియాలో సరికొత్త వసూళ్లు రాబట్టింది. నైజాం ఏరియాలో ఈచిత్రం దాదాపు రెండున్నర కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో విడుదలైన తెలుగు సినిమాలకు ఈ రేంజిలో కలెక్షన్ రావడం విశేషమే అంటున్నారంతా. రెబెల్ తో డీలా పడ్డ ప్రభాస్ ఈ చిత్రంతో పుంజుకున్నారు.
రచయిత కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











