హాటుగా...ఘాటుగా (మిర్చి ప్రివ్యూ...)

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు.

మాటల రచయితగా పరిశ్రమలో మంచి పేరుతెచ్చుకున్న కొరటాల శివ....ఈ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు కూడా ఇందులో ఉన్నాయని, లవ్ అండ్ యాక్షన్ సన్నివేశాలతో సాగే వినోదాత్మక చిత్రమని దర్శకుడు అంటున్నారు.

కథ విషయానికొస్తే... జై (ప్రభాస్) ఇటలీలో ఆర్కిటెక్ ఉద్యోగం చేస్తుంటారు. వీలైతే ప్రేమిద్దాం అనే మనస్తత్వం గల వ్యక్తి. హ్యాపీగా జీవితం గడుపుతున్న అతను ఉన్నట్టుండి ఓ సమస్య కారణంగా ఇండియాకి తిరిగి వస్తాడు. వెన్నెల(అనుష్క), మానస(రీచా గంగోపాధ్యాయ్) లలో జై ఎవరిని ప్రేమించాడు? ఆ సమస్య ఏమిటి? అనేది తర్వాతి కథ.

సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X