ప్రభాస్ ‘మిర్చి’ హిందీ రైట్స్ కేక, లేడీస్‌కి స్పెషల్
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'మిర్చి' చిత్రానికి హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అదిరిపోయే రేంజిలో వచ్చాయి. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ హిందీ టీవీ ఛానల్ రూ. 2.75 కోట్లు చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హిందీ ఛానల్స్‌లో బాలీవుడ్ సినిమాల తర్వాత ఎక్కువ టీఆర్పీ రేటింగులు వస్తున్న సినిమాలు తెలుగు సినిమాలే. అందుకే చాలా ఛానల్స్ తెలుగు సినిమాలను కొని వాటిని హిందీలోకి అనువదించి అక్కడ టీవీల్లో రిలీజ్ చేసి బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాష్ 'మిర్చి' సినిమాకు భారీ మొత్తంలో రేటు పలికినట్లు తెలుస్తోంది.
లేడీస్ కోసం స్పెషల్ పాసులు..
మిర్చి ఆడియో జనవరి 5న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు సినీ విలేజ్ లో ఆడియో వేడుక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణాన్ని ఎక్కువమంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే... ఆడియో ఫంక్షన్లో మహిళా అభిమానులకు ప్రత్యేక స్థానం కల్పించారు. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని పాసులు రిలీజ్ చేసారు. వీటిపై కేవలం మహిళా అభిమానులకు మాత్రమే ఎంట్రీ అన్నమాట.
అనుష్క, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రానికి సంభాషణలు అందించిన కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











