రేపటి నుంచి ‘మిర్చి’ సినిమాలో స్పెషల్ ఫైట్
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'మిర్చి' చిత్రంలో రేపటి నుంచి స్పెషల్ ఫైట్ యాడ్ చేస్తున్నట్లు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు ప్రకటించారు. చాలా ఖర్చు పెట్టి గ్రాండ్‌గా షూట్ చేసిన ఈ ఫైట్‌ను సాంకేతిక కారణాలతో విడుదల రోజు యాడ్ చేయలేక పోయామని, ఇప్పుడు మళ్లీ ఆ ఫైట్ ను సినిమాలో చేర్చుతున్నట్లు వెల్లడించారు.
ఈ స్పెషల్ ఫైట్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ... 'మిర్చి సక్సెస్ జోష్‌ను మరింత రెట్టింపు చేసేందుకు ఓ స్పెషల్ ఫైట్ యాడ్ చేస్తున్నాం. అభిమానుల కోరిక మేరకే ఈ ఫైట్‌ను జోడిస్తున్నాం. ఈ యాక్షన్ పార్ట్ కోసం నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు. నేను కూడా చాలా కష్ట పడ్డాను. మిర్చి చిత్రానికి ఘనవిజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ మరోసారి థాంక్స్ చెబుతున్నాను' అని వ్యాఖ్యానించారు.
మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న మిర్చి చిత్రం ఇప్పటికే రూ. 40 కోట్లు వసూలు చేసింది. సినిమా బిజినెస్ పూర్తయ్యే వరకు ఈ చిత్రం వసూళ్లు రూ. 50 కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ 'మిర్చి' చిత్రం ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా, హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఈచిత్రం వరల్డ్ వైడ్ గా పలు సెంటర్లలో మంచి కలెక్షన్లతో సాగుతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
తొలి సినిమా దర్శకత్వంలోనే విజయం సాధించిన కొరటాల శివకు ఇప్పటికే ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి త్వరలో భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నారు. తాను త్వరలో కొరటాల శివ తో సినిమా చెయ్యబోతున్నాను అని గణేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.


Click it and Unblock the Notifications











