మిర్చి: కొత్తగా యాడ్‌చేసే ఫైట్‌లో ప్రభాస్ ఇలా... (ఫోటోలు)
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'మిర్చి' చిత్రంలో ఈ రోజు నుంచి కొత్తగా ఒక రెయిన్ ఫైట్ యాడ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫైట్‌కు సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా విడుదల చేసారు. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫైట్ చూడటానికి అభిమానులు మళ్లీ థియేటర్ల బాట పడుతున్నారు.
ముందస్తు ప్లాన్ ప్రకారం వీకెండ్‌లో విడుదల చేయడం ద్వారా నిర్మాతలు మరిన్ని కలెక్షన్స్ రాబట్టేందుకు ప్లాన్ చేసారు. ఏది ఏమైనా మిర్చి బిజినెస్ తగ్గు ముఖం పడుతున్న నేపథ్యంలో మళ్లీ ఈ ఫైట్ యాడ్ చేయడం వల్ల అదనపు లాభాలు వస్తాయని నిర్మాతలు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మిర్చి చిత్రం ఇప్పటి వరకు రూ. 45 కోట్లకు పైగా గ్రాస్, రూ. 40 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫైట్ యాడ్ చేయడం ద్వారా ప్రభాస్ అభిమాన వర్గం మరోసారి సినిమా చూస్తారు. ఈ లెక్క ప్రకారం సినిమా అతి త్వరగా రూ. 50 కోట్ల మార్కను క్రాస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

మిర్చి చిత్రంలో కొత్త యాడ్ చేసిన ఫైట్ లో ప్రభాస్ లుక్.

ట్రేడ్ ఎక్స్ పర్ట్స్ ‘మిర్చి' చిత్రం ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా, హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

అభిమానుల కోరిక మేరకే ఈ ఫైట్‌ను జోడిస్తున్నాం. ఈ యాక్షన్ పార్ట్ కోసం నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

ఈ ఫైట్‌ను సాంకేతిక కారణాలతో విడుదల రోజు యాడ్ చేయలేక పోయామని నిర్మాతలు తెలిపారు.

తొలి సినిమా దర్శకత్వంలోనే విజయం సాధించిన కొరటాల శివకు ఇప్పటికే ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.

మిర్చి చిత్రంలో కొత్త యాడ్ చేసిన ఫైట్ లో ప్రభాస్ లుక్.
కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ ప్రభాస్ సరసన హీరోయిన్లుగా చేయగా, యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, యూ. ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని నిర్మించారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











