‘మిర్చి’ దర్శకుడు నెక్ట్స్ మహేష్, ఎన్టీఆర్‌లతో...!
హైదరాబాద్ : ప్రభాస్‌తో చేసిన ఒకే ఒక్క సినిమా 'మిర్చి'తో స్టార్ దర్శకుడిగా మారిన రచయిత కొరటాల శివకు అవకాశాల మీద అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మిర్చి సినిమా ఇలా విడుదలైందో లేదో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న కొరటాల శివ ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కులో నిమగ్నమై ఉన్నాడు.
ప్రస్తుతం రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ దర్శకుడినికి పలువురు నిర్మాతలు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. అందుకు కారణం ఏమిటో తెలుసా? మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కొరటాల శివతో సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నారు.
ఈ విషయం పలువురు బడా నిర్మాతల చెవిన పడటంతో కొరటాల శివ వెంట పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. స్టార్ హీరోలతో కొరటాల శివ కాంబినేషన్ సినిమా అయితే మంచి లాభాలు వస్తాయనే నమ్మకమే ఇలాంటి పరిస్థితులకు దారి తీసిందని అంటున్నారు.
భవిష్యత్‌లో కొరటాల రామ్ చరణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ లాంటి హీరోలతో హిట్లు కొడితే టాప్ రేంజికి వెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు. 'మిర్చి' చిత్రం సూపర్ హిట్టయింది. మరి ఆ ఊపును కంటిన్యూ చేస్తూ కొరటాల శివలో టాప్ దర్శకుడు అయ్యే సత్తా ఉందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











