‘మిర్చి’ టీజర్‌కు భారీ రెస్పాన్స్!
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మిర్చి'. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
తాజాగా ఆదివారం ఈచిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌కు ఇంటర్నెట్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలై స్టిల్స్, వాల్ పోస్టర్స్.... తాజాగా ఈ టీజర్ బట్టి సినిమా ఎంత స్టైలిష్ గా ఉంటుందో అర్థం అవుతోంది. దర్శకుడు కొరటాల శివ ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు యంగ్ రెబల్ స్టార్‌తో పలికించాడు.
సంక్రాంతి పురస్కరించుకుని 'మిర్చి' చిత్రాన్ని డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదల రెబల్ చిత్రం ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచినా.... ఈ చిత్రంతో మళ్లీ ప్రభాస్ పుంజుకోవడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











