‘మిర్చి లాంటి కుర్రాడు’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై అభిజిత్, ప్రగ్యా జైశ్వాల హీరోహీరోయిన్స్ గా రూపొందతోన్న సినిమా ‘మిర్చి లాంటి కుర్రాడు'. ప్రేమలత సమర్పణలో రుద్రపాటి రమణారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జయనాగ్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
నిర్మాత రుద్రపాటి రమణారావు సినిమా గురించిమాట్లాడుతూ ‘'ఈ సినిమా ద్వారా జయనాగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అభిజిత్, ప్రగ్యా జైశ్వాల హీరోహీరోయిన్లుగా రావు రమేష్, షకలక శంకర్, సప్తగిరి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి పనిచేశారు. జె.బి. మంచి సంగీతాన్ని అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్, ఆర్.ఎం.స్వామి గారి కెమెరా వర్క్ సినిమాకి ప్లస్ అవుతాయి. ఇదొక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందిస్తున్నాం'' అని తెలిపారు.

చిత్ర దర్శకుడు జయనాగ్ మాట్లాడుతూ ‘'నేను విశ్వనాథ్,వినాయక్, రాజమౌళి, వంటి దర్శకుల దగ్గర పనిచేశాను. రమణారావుగారు ఈసినిమాతో నాకు దర్శకుడిగా లైఫ్ నిచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మరో రెండు వారాల్లో ఆడియో, ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని తెలిపారు.



Click it and Unblock the Notifications











