మిర్రర్ మీడియా కొత్త చిత్రం 'ఇదేదో బాగుంది'
హైదరాబాద్: ఇటీవలే టాలీవుడ్ సూపర్ హీరోయిన్ కాజల అగర్వాల్ చేతుల మీదుగా ఆడియో విడుదలయ్యి సూపర్ సక్సెస్ అయ్యిన 'పిచ్చెక్కిస్తా..' సినిమా నిర్మాత నటరాజ్ కొట్టూరి నిర్మాతగా, మిర్రర్ మీడియా పతాకంపై, స్వీట్ మిర్చిస్ స్టూడియోస్ సమర్పణలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు.

ఆ చిత్రం పేరు 'ఇదేదో బాగుంది '. ఈ చిత్రం ద్వారా సూర్య శ్రీనివాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు. సాహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మా బ్యానర్ మిర్రర్ మీడియా లో నిర్మించిన 'పిచ్చేక్కిస్తా..' చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నాము. మా మరో చిత్రం 'ఇదేదో బాగుంది ' అనే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది' అన్నారు.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ‘ఇదేదో బాగుంది' చిత్రంలో ప్రముఖ కమెడియన్ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్ హీరోగా చేస్తుండగా, శివాని సింగ్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాము. సాహిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంగీత దర్శకుడు గంటశాల విశ్వనాద్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. సినిమాని అతి త్వరలో సెట్స్ మీదకి తీసుకువేళతాము ' అని తెలిపారు.


Click it and Unblock the Notifications