'మిర్రర్' - మరో మూకీ మూవీ

ఇందులో కథ వికలాంగుల ఆశలు, నిరాశలు, కలలు చుట్టూ తిర్గుతుందిట. వారి జీవితాల్లో సైలన్స్ అనేది యే రకంగా ప్రధాన పాత్ర వహిస్తుందనేది ముఖ్యాంశంట. అందుకే ఈ చిత్రాన్ని మూకీ గా చెయ్యటానికి డిసైడ్ చేసుకున్నారుట. ఈ సినిమా కేరళ,మైసూరు,బెంగుళూరు,రామనగర పరిశర ప్రాంతాలలో షూటింగ్ జరుపుపుకొంటోంది. ఈ చిత్రంలో చేతులు లేని ఓ పొడవైన ( 7 feet 9 inches) ఓ మైసూరు వాసి ప్రధాన పాత్రలో కనపడనున్నాడు. ఇక మన తెలుగులో ఇప్పుడు సి.సి.రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చుట్టూ తిరగే కథతో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఓ మూకీ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం ఓ గిరజన వాసి గా కనపడే ఈ చిత్రం ప్రభుత్వ ప్రచార చిత్రంలా ఉంటుందంటున్నారు.


Click it and Unblock the Notifications











