'మృగం' వస్తోంది!!!

ఇక మలయాళంలో ప్రముఖ కథానాయికగా పేరుతెచ్చుకుని తమిళంలోనూ రాణించిన పద్మప్రియ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో ఎవరికీ భయపడకుండా మగరాయుడిలా పెరిగిన పద్మప్రియ ఆ మొరటు యువకుని ఎదిరించటంలోగాని అతనితో పోటీపడటంలోగానీ తనకు తానే సాటి అనే విధంగా సినిమా ఆద్యంతమూ అద్భుతంగా నటించి సినిమా సక్సెస్‌కు ఎంతో దోహదపడింది. పద్మప్రియ, ఆదిలతో తీసిన పడకగది దృశ్యాలు యువతను తన్మయత్వంతో ముంచడంతోపాటు క్లైమాక్స్ దృశ్యాలు ఆలోచనలో పడేస్తాయి.
ఇక ఈ సినిమా కథ తమిళంలో పేరున్న ప్రముఖ రచయిత వైరముత్తు రాసిన “Kallikattu Idhigasam" నుండి తీసుకున్నారు. ఈ సినిమా అక్కడే కాక కేరళ లోనూ డబ్బింగై రికార్డు స్ధాయిలో కలెక్షన్లు వర్షం కురింపించింది. దాంతో తమిళ, మలయాళ భాషల్లో నిర్మించిన కార్తిక్ జై మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారే ఎన్నో మార్పులు చేసి తెలుగులోనూ వదులుతున్నారు. తమిళ, మలయాళ పరిశ్రమల్లో విజయం సాధించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ రికార్డులు సృష్టిస్తుందని ఈ చిత్ర నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











