twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మృగం' వస్తోంది!!!

    By Staff
    |

    Mrugam
    తమిళంలో Mirugam పేరుతో రిలీజై హిట్టయిన సినిమా ఇప్పుడు తెలుగులోకి 'మృగం' పేరుతో డబ్బింగ్ అవుతోంది. టైటిల్ పాత్రలో చేసిన 'ఆది' అనే యువ నటుడు, తన మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రామంలో అచ్చోసిన ఆబోతులా తిరుగుతూ ఎవరికీ లొంగకుండా కనిపించిన ప్రతి అమ్మాయినీ అనుభవిస్తూ తిరిగే మొరటు యువకుని పాత్రలో హీరో ఆది జీవించాడనే చెప్పాలి.

    ఇక మలయాళంలో ప్రముఖ కథానాయికగా పేరుతెచ్చుకుని తమిళంలోనూ రాణించిన పద్మప్రియ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో ఎవరికీ భయపడకుండా మగరాయుడిలా పెరిగిన పద్మప్రియ ఆ మొరటు యువకుని ఎదిరించటంలోగాని అతనితో పోటీపడటంలోగానీ తనకు తానే సాటి అనే విధంగా సినిమా ఆద్యంతమూ అద్భుతంగా నటించి సినిమా సక్సెస్‌కు ఎంతో దోహదపడింది. పద్మప్రియ, ఆదిలతో తీసిన పడకగది దృశ్యాలు యువతను తన్మయత్వంతో ముంచడంతోపాటు క్లైమాక్స్ దృశ్యాలు ఆలోచనలో పడేస్తాయి.

    ఇక ఈ సినిమా కథ తమిళంలో పేరున్న ప్రముఖ రచయిత వైరముత్తు రాసిన “Kallikattu Idhigasam" నుండి తీసుకున్నారు. ఈ సినిమా అక్కడే కాక కేరళ లోనూ డబ్బింగై రికార్డు స్ధాయిలో కలెక్షన్లు వర్షం కురింపించింది. దాంతో తమిళ, మలయాళ భాషల్లో నిర్మించిన కార్తిక్ జై మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారే ఎన్నో మార్పులు చేసి తెలుగులోనూ వదులుతున్నారు. తమిళ, మలయాళ పరిశ్రమల్లో విజయం సాధించినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ రికార్డులు సృష్టిస్తుందని ఈ చిత్ర నిర్మాత ధీమా వ్యక్తం చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X