పాపం ఆ క్రేజీ హీరోయిన్‌ను అలా చంపేశారట.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకుడదు!!
ప్రస్తుతం మనమున్న సోషల్ మీడియా కాలంలో నిజం కంటే అబద్దమే ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అబద్దాలను నమ్మినంతా ఈజీగా నిజాలు నమ్మలేకపోతున్నారు. ఇది నిజం అని చెప్పే లోపు అబద్దం దావానంలా దహించేస్తోంది. నిజం గడపదాటే లోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టేసినట్టు తయారైంది వ్యవహారం. తాజాగా ఇలానే ఓ హీరోయిన్‌ను తమ తప్పుడు వార్తలతో చంపేశారు కొందరు. తీరా చివరికి సదరు హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకునే వరకు వచ్చింది వ్యవహారం. అసలు జరిగిందేంటో ఓ సారి చూద్దాం.

మిస్త్రీ చక్రవర్తిపై..
తెలుగులో చిన్నదాన నీకోసం అనే సినిమాతో నితిన్ పక్కన మెరిసింది మిస్త్రీ చక్రవర్తి. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అంతగా అవకాశాలు రాలేదు. అయితే తమిళ, హిందీ భాషల్లో మాత్రం కాస్త అవకాశాలు కొట్టేసింది. మణికర్ణిక, గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ హీరోయిన్‌ను ఇప్పుడు కొందరు తమ తప్పుడు వార్తలతో చంపేశారు.

కిడ్నీ ఫెయిల్యూర్..
మిస్త్రీ చక్రవర్తి కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయినట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అంతే కాకుండా ఓ అడుగు ముందుకు వెసి తల్లిదండ్రులు స్పందించినట్టు.. దహన సంస్కారాలు జరిపించినట్టు కూడా కథనాలు అల్లేశారు. మిస్త్రీ అమ్మ ఇంకా షాక్‌లోనే ఉన్నట్టు మసాలా దట్టించారు.

చనిపోయినట్టు డేట్..
ఇక మీడియాలో ఇలా కుప్పులు తెప్పలుగా వార్తలు రావడంతో వికీ పీడియాలోనూ మిస్త్రీని చంపేశారు. చనిపోయినట్టుగా తేదీని కూడా ఫిక్స్ చేసేశారు. అక్టోబర్ 2న చనిపోయిందని వికీ పీడియా ఇలా అధికారికంగా ప్రకటించింది. ఇలా తనపై వచ్చిన రూమర్లు, ఫేక్ న్యూస్‌పై మిస్త్రీ అదిరిపోయే కౌంటర్లు వేసింది.
Recommended Video

నేను ఈ రోజు చనిపోయాను..
కొన్ని మీడియా సంస్థల రిపోర్ట్ ప్రకారం నేను ఈ రోజు చనిపోయాను.. కానీ దేవుడి దయ వల్ల నేను బాగానే ఉన్నాను.. అయినా నేను ప్రయాణించాల్సింది ఎంతో ఉంది. ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు. నిజానిజాలు తెలుసుకోకుండా సెలెబ్రిటీల విషయంలో కొందరు అతి చూపడం వల్లే ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











