వక్రీకరించారు, విభేదాలు లేవంటున్న రాజమౌళి!
హైదరాబాద్: మీడియాలో వస్తున్న వార్తలపై దర్శకుడు రాజమౌళి మరోసారి గరం గరం అయ్యారు. కొన్ని వెబ్ సైట్లు రాజమౌళి, సమంత మధ్య విబేధాలు ఉన్నట్లు వార్తలు క్రియేట్ చేయడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇవన్నీ తప్పుడు వార్తలుగా ఆయన కొట్టి పారేసారు. ట్విట్టర్లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
'బాహుబలి' చిత్రంలో తనకు నటించాలని ఉంది కానీ...రాజమౌళి సార్ చాన్స్ ఇవ్వడం లేదని సమంత ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించగా.....రాజమౌళి ట్విట్టర్లో స్పందిస్తూ 'ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ సమంతా? బాహుబలి సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేయాలని నేను నిన్న పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసాను. కానీ నువ్వే డేట్స్ లేవని చెప్పావుగా. ఇపుడు ఇలా మాట్లాడటం నీకు తగునా? నీ వ్యాఖ్యల వల్ల నీ ఫ్యాన్స్ నా మీద కోపంగా ఉన్నారు' అని వ్యాఖ్యానించారు.

ఇదంతా జస్ట్ సరదాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే....అంతేగానీ ఇందులో సీరియస్ మ్యాటర్ ఏమీ లేదు అని రాజమౌళి స్పష్టం చేసారు. కానీ కొన్ని వెబ్ సైట్స్ నా వ్యాఖ్యలకు లేనిపోని కల్పించి తమ మధ్య విబేధాలు ఉన్నట్లు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











