టాలీవుడ్ పై కన్నేసిన మిస్ ఆంధ్ర
మిస్ ఆంధ్ర-2011 టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ సుందరి మహిమా బరారియా ఇప్పుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతోంది. 19 ఏళ్ల భామ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ....మోడలింగ్ కెరియర్ కొనసాగిస్తూనే మిస్ ఇండియా పోటీలకు సిద్ధం అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి వచ్చే ఆలచన ఏమైనా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ..... టాలీవుడ్ లో నటించాలని ఉందనే తన మనసులోని కోరికను బయట పెట్టిది. తనకు ఇప్పటికే కొందరు దర్శక, నిర్మాతల నుంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయని, అయితే అందుకు నేనేమీ తొందర పడటం లేదని, మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది.
మహిమా తల్లిదండ్రులది రాజస్థాన్. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన మహిమ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్స్ విద్యార్థి. మోడలింగ్ రంగంపై ఉన్న మక్కువతో ఆ రంగంలో రాణిస్తున్న ఈ అమ్మడు ఇటీవల జరిగిన మిస్ ఆంధ్ర-2011 పోటీల్లో విజేతగా నిలిచింది. సినిమా రంగంపై ఓ కన్ను, మిస్ ఇండియా టైటిల్ పై ఓ కన్ను వేసి ఏది వీలైతే అందులో సెటిల్ అవుదామని చూస్తున్న ఈ బ్యూటీ ఫ్యూచర్ ఏమిటో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











