పవన్ ఓ అద్భుతమైన మానవతా విలువలున్న వ్యక్తి....!?
తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ద్వారా మాజీ మిస్ ఇండియా సారాజేన్ డియాస్ తెలుగులో కథానాయికగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. 'షాడో" వర్కింగ్ టైటిల్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.అయితే ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన ఈ సుందరి పవన్ కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తింది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో టాలీవుడ్ లోకి లాంచ్ కావడం తన అదృష్టమని చెప్పింది. 'పవన్ ఓ అద్భుతమైన మానవతా విలువలున్న వ్యక్తి. జీవితాన్ని అన్ని విషయాల్లో తరచి చూసాడతను.
కెరీర్ ప్రారంభంలో వున్న మాలాంటి వాళ్లు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది. కొద్ది పరిచయంతోనే నేను ఆయన అభిమానిగా మారిపోయాను. నేనింతవరకు చూసిన నటుల్లోకెల్లా ఆయనే ది బెస్ట్" అంటూ పొగడ్తల జల్లు కురిపించింది. మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న ఈ భామ తమిళ చిత్రం (తీరద విలయాట్టు పిళెలై) ద్వారా కథానాయికగా పరిచయమయింది. బాలీవుడ్ లో అభిషేక్ బచ్చన్ సరసన 'గేమ్" చిత్రంలో నటించింది. మాజీ మిస్ వరల్డ్ గా తప్ప వేరే ఇతర గుర్తింపుకు నోచుకోని ఈ హాట్ గాళ్ కు తెలుగు పరిశ్రమ ఎలాంటి బ్రేక్ నిస్తుందో వేచిచూద్దాం!


Click it and Unblock the Notifications











