Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మిస్ ఇండియా ‘శారా జానే’తో పవన్ కళ్యాణ్ రొమాన్స్...
పవన్ కల్యాణ్ హీరోగా 'బిల్లా, సర్వం"చిత్రాల దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా మాజీ మిస్ ఇండియా శారా జానే ఎంపికైంది. 'ప్యాంటలూన్స్ ఫిమినా మిస్ ఇండియా వర్డ్ 2007" సంవత్సరానికి మిస్ ఇండియాగా ఎంపికైన శారా గతంలో ఛానెల్ V లో వీజేగా పనిచేసింది. 'కిలాడీ' పేరుతో తెలుగులోకి డబ్ అయిన 'తీరత్త విలయాట్టు పిళై"హీరో విశాల్ సరసన తమిళ సినిమాలో ఈమె తొలిసారిగా నటించింది.
ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ తో 'గేమ్' హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, పవన్ కల్యాణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం 'ది షాడో' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. మార్చ్ మొదటి వారంలో షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ కలిసి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతాన్ని సమకూరుస్తాడు.