twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిస్ ఇండియా థ్రిల్లింగ్ స్టోరి

    By Staff
    |

    తెలుగు అమ్మాయి మిస్ ఇండియా గద్దె సింధూర 'సంగమం" చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైనప్పటికీ ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తెరమరుగైనది. ఈ మధ్యనే రవి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'అమరావతి" చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సింధూర గద్దె కు మరియొక్క అవకాశం వరిచంది. హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రంగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో ప్రధాన పాత్రతో రూపుదిద్దుకోబోతున్నది. గతంలో 'శ్రీ సత్య నారాయణ స్వామి" చిత్రానికి దర్శకత్వం వహించిన నగేష్ నారదాశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ 9 నుండి తిరుపతి, చంద్రగిరి తలకోన పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ నెల రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ళ భరణి, సాయికుమార్, జీవా, విజయ్ తదితరులు నటిస్తున్నారు. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X